ETV Bharat / sitara

RC15: చరణ్​-శంకర్​ కొత్త సినిమా హంగామా షురూ

author img

By

Published : Sep 8, 2021, 9:24 AM IST

Updated : Sep 8, 2021, 10:02 AM IST

మరికాసేపట్లో ప్రముఖ దర్శకుడు శంకర్​-రామ్​చరణ్(ram charan shankar movie updates)​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో​ లాంఛనంగా ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

RC15
శంకర్​-రామ్​చరణ్

ప్రముఖ దర్శకుడు శంకర్​-రామ్​చరణ్​(rc 15 movie cast) కాంబోలో ఓ సినిమా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. నేడు(సెప్టెంబరు 8) ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో శంకర్​, రామ్​చరణ్​, కియారా అడ్వాణీ(rc 15 movie heroine), సునీల్​, అంజలి, నిర్మాత దిల్​రాజు, సంగీత దర్శకుడు తమన్​ సహా పలువురు ఉన్నారు. ఒంటికి సూట్​, కంటికి కళ్లజోడు, చేతిలో ఫైల్స్​ పట్టుకుని స్టైలిష్​ ఆఫీసర్స్​లా వీళ్ల లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్​కు 'మేము వస్తున్నాం'​ అంటూ వ్యాఖ్య జోడించారు.

rc 15
ఆర్​సీ 15

నేడు(సెప్టెంబరు 8) ఉదయం 11గంటలకు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మెసాస్టార్​ చిరంజీవి, బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​, దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిలుగా విచ్చేయనున్నారు.

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌(ramcharan shankar movie update) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాను తెరకెక్కించనున్నారు. తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల 135 మంది మ్యూజిషియన్లతో కలిసి ఆయన ఈ సినిమాకు సంబంధించిన​ తొలి రికార్డింగ్​ పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం. విలన్​గా మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదీ చూడండి: 'మెగా'సిస్టర్స్​కు రామ్​చరణ్ రాఖీ​ ట్రీట్!​

Last Updated : Sep 8, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.