ETV Bharat / sitara

bigg boss 5: కాజల్‌కు నిజంగానే గాయమైందా?

author img

By

Published : Oct 9, 2021, 11:40 AM IST

bigboss
బిగ్​బాస్​

బిగ్​బాస్​(bigg boss captaincy task winner) అయిదో వారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్​లో ప్రియ విజయం సాధించింది. ఇక ఈ షోలో స్వల్పంగా గాయపడిన కాజల్​ వరెస్ట్​ పెర్‌ఫార్మర్‌గా నామినేట్​ అవ్వడం వల్ల జైలుకు వెళ్లింది.

ప్రియకు బిగ్‌బాస్(bigg boss captaincy task winner) ఇచ్చిన బంపర్ ఆఫర్‌ కలిసొచ్చింది. ఐదోవారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ఆమె విజయం సాధించి, కొత్త కెప్టెన్‌ అయ్యారు(bigg boss contestant priya telugu). తాము ఎంతో కష్టపడి ఆడామని అయినా, ప్రయోజనం లేకుండా పోయిందని సన్నీ, మానస్‌లు కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ప్రియ కెప్టెన్‌ కావడం నాకు ఇష్టం లేదు' అని సన్నీ బహిరంగంగానే చెప్పాడు. కొత్త కెప్టెన్‌ ప్రియకు రవి సలహాదారుడు అయ్యాడు. ఎవరెవరికి ఏయే పనులు చెప్పాలో వివరించాడు.

priya
ప్రియా

నిజంగానే కాజల్‌ చేయి తెగిందా?

గార్డెన్‌ ఏరియాలో ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతున్న కాజల్‌(bigg boss contestant kajal) గురించి రవి, ప్రియలు చర్చించుకున్నారు. 'కాజల్‌కు నిజంగానే గాయం అయిందా' అని ప్రియ అడగ్గా, 'చిన్నగా తోలు లేచింది' అని రవి సమాధానం ఇచ్చాడు. ఇంకా కాజల్‌ గురించి రవి మాట్లాడుతూ.. ఆమె ఎమోషన్స్‌ను పక్కన పెట్టి గేమ్‌ ఆడుతుందని, ఆమెది రాతి హృదయమని చెప్పాడు.

ఆమే వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌

ఈ వారం బెస్ట్‌/వరెస్ట్‌ పెర్ఫార్మర్‌(bigg boss worst contestant) ఎవరో చెప్పాలని బిగ్‌ ఇంటి సభ్యులకు సూచించాడు. నెక్‌లాక్‌లో వాళ్లను బంధించి ముఖంపై నీళ్లు కొట్టాలని ఆదేశించాడు. దీంతో అత్యధికమంది కాజల్‌ను వరెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా ఎంచుకోవడం వల్ల ఆమెను జైల్లో వేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ ప్రక్రియ నామినేషన్స్‌ను తలపించింది. తనకు వంట రాకపోయినా తనని చేయమన్నారంటూ శ్రీరామ్‌పై జెస్సీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. షణ్ముఖ్‌(bigboss shanmukh), సిరిలు ఒకే బాటలో పయనిస్తూ విశ్వ ముఖంపై నీళ్లు కొట్టారు. కెప్టెన్సీ టాస్క్‌ సందర్భంగా జరిగిన వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని సన్నీపై శ్రీరామ్‌ నీళ్లు చల్లుతాడని అందరూ అనుకున్నారు. సన్నీ కూడా అదే అనుకున్నాడు. కానీ, అందుకు భిన్నంగా శ్రీరామ్‌.. కాజల్‌ ముఖంపై నీళ్లు కొట్టాడు. కాజల్‌పై(bigg boss worst contestant) ఉన్న కోపాన్ని అనీ మాస్టర్‌ తనపై చూపించుకుని, తన ముఖంపై తానే నీళ్లు కొట్టుకోవడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. రవి-కాజల్‌ల మధ్య కూడా ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదం జరిగింది.

శ్వేత, హమీద, శ్రీరామ్‌, అనీ మాస్టర్‌, రవి, లోబో, విశ్వలు.. కాజల్‌ను నామినేట్‌ చేయడం వల్ల ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సెంచరీ మ్యాట్రసిస్‌ టాస్క్‌ నిర్వహించాడు. పరుపుపై ఎవరు ఎక్కువ సేపు ప్లాంక్‌ వేస్తారో వారికి బహుమతులు ఇస్తామని ప్రకటించాడు. ఇక రోజు నాగార్జున రాకతో షో ఆసక్తికరంగా మారనుంది. నామినేషన్స్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే ఈ వీకెండ్‌ షో చూడాల్సిందే!

ఇదీ చూడండి: Bigg Boss 5: ప్రియకు బంపర్ ఆఫర్.. కెప్టెన్​గా ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.