ETV Bharat / sitara

అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్​ను ఇమిటేట్​ చేస్తే..

author img

By

Published : Dec 20, 2021, 5:31 AM IST

'పుష్ప' కొత్త ఇంటర్వూలో భాగంగా డైరెక్టర్ సుకుమార్​లా నటించి అల్లు అర్జున్ చూపించారు. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ చేయనున్నారు.

allu arjun
అల్లు అర్జున్ సుకుమార్

థియేటర్లలో తెగ సందడి చేస్తున్న 'పుష్ప'.. ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పిస్తోంది. కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మొత్తం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా డైరెక్టర్​ సుకుమార్ సెట్​లో ఎలా ఉంటారో ఇమిటేట్​ చేసి చూపించారు హీరో అల్లుఅర్జున్.

అందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం ట్వీట్ చేసింది. షాట్ పూర్తయిన తర్వాత సుకుమార్​ సైలెంట్​గా ఉంటారని, దగ్గరకు వెళ్లి అడిగితే ఎలా రియాక్ట్​ అవుతారనేది బన్నీ చేసి చూపించారు.

శేషాచలం ఎర్రచందనం నేపథ్యంగా తీసిన 'పుష్ప' తొలి భాగం ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రెండు రోజుల్లోనే(రూ.116) వందకోట్ల రూపాయల మార్క్​ గ్రాస్​ కలెక్షన్ సొంతం చేసుకుంది.

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్​గా చేసింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో రెండో భాగం షూటింగ్ ప్రారంభమవుతుంది. దసరా లేదంటే డిసెంబరు కల్లా థియేటర్లలో 'పుష్ప-2' విడుదలవుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ వెల్లడించారు.

allu arjun pushpa
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.