ETV Bharat / sitara

'నాగ చైతన్య-సమంత అందుకే విడిపోయారు'

author img

By

Published : Oct 6, 2021, 3:41 PM IST

Naga Chaitanya Samantha divorce
నాగచైతన్య సమంత

నాగచైతన్య-సమంత(naga chaitanya samantha news) విడిపోవడంపై స్పందించారు నటి మాధవీలత(madhavi latha comments on samantha). వ్యక్తిగత కారణాల వల్లే వారిద్దరూ విడిపోయారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికల్లో పోటీపై కూడా మాట్లాడారు.

నాగచైతన్య-సమంత(naga chaitanya samantha news) విడిపోవడంపై సోషల్‌మీడియాలో వస్తున్న వరుస కామెంట్లపై తాజాగా నటి మాధవీలత(madhavi latha comments on samantha) స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్లే వాళ్లిద్దరూ విడిపోయారంటూ ఆమె షాకింగ్‌ కామెంట్లు చేశారు. ఈ మేరకు తాజాగా ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించిన మాధవి ఈ జోడీ విడాకులపై మాట్లాడారు.

"చైతూ-సామ్ విడిపోవడం గురించి చాలామంది చాలారకాలుగా మాట్లాడుకుంటున్నారు. సినిమావాళ్లు విడాకులు తీసుకోవడం సర్వసాధారణమని, పెళ్లాయ్యాక కూడా ఆమె గ్లామర్‌ రోల్స్‌ చేయడమే కారణమని చెప్పుకొంటున్నారు. నిజం చెప్పాలంటే, ఇప్పుడున్న రోజుల్లో విడాకులు తీసుకోవడం సాధారణ విషయమై పోయింది. కానీ సినిమా వాళ్ల కంటే కూడా బయటవాళ్లే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అలాగే, పెళ్లాయ్యాక ఇంట్లో వాళ్ల అనుమతితోనే ఆమె సినిమాల్లో నటించింది. గ్లామర్‌ రోల్స్‌ చేసింది. పెళ్లి, కుటుంబం, పిల్లలు.. ఇలా ప్రతి విషయంపై ఆమెకు ఎంతో నమ్మకం ఉంది. మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే.. ఆమె ఎంతో మంచి మనిషి. షాపింగ్‌ మాల్స్ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చే డబ్బుని ప్రత్యూష ఫౌండేషన్‌ కోసమే ఖర్చు చేసింది. నటనకు కోట్లలో పారితోషికం వచ్చినా ఆమెకు పాకెట్‌మనీ మాత్రమే ఇచ్చేవారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురవడం వల్లే ఆమె చివరికి విడిపోవడానికి అంగీకారం తెలిపింది" అని కీలకవ్యాఖ్యలు చేశారు మాధవి(madhavi latha comments on samantha).

గట్టిపోటీ ఇచ్చేదాన్ని..

అనంతరం మాధవీలత(madhavi latha maa elections) ఆమె 'మా’' ఎన్నికల(maa elections 2021) గురించి స్పందిస్తూ.. సభ్యత్వం ఉండుంటే తప్పకుండా ఎన్నికల్లో నిలబడేదాన్ని అని చెప్పారు. ''‘మా'లో సభ్యత్వం తీసుకోలేదు కానీ, తీసుకుని ఉంటే 1000శాతం ఎన్నికల్లో పోటీ చేసేదాన్ని. గెలుపు ఓటములను పక్కన పెడితే మహిళల సమస్యలను తప్పకుండా గట్టిగా వినిపించేదాన్ని. గట్టిపోటీ మాత్రం ఇచ్చేదాన్ని. ఇప్పటివరకూ నాకు 'మా'maa elections 2021తో ఎలాంటి అవసరం రాలేదు. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చే ఏడాది 'మా'లో సభ్యత్వం తీసుకుంటా" అని ఆమె వివరించారు.

ఇవీ చూడండి:'ఎఫ్​-3' షూటింగ్​లో బన్నీ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.