ETV Bharat / science-and-technology

Facebook Hacked Account Recovery : మీ ఫేస్​బుక్ ఖాతా హ్యాక్ అయిందా?.. అయితే ఈ టిప్స్​తో ఈజీగా రికవర్​ చేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 3:40 PM IST

facebook hacked recovery
Facebook Account Hacked

Facebook Hacked Account Recovery : మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ఫేస్​బుక్ ఒక్కసారైనా చూడకుండా ఆ రోజు గడవదు. అంతలా అది మన జీవితంలో స్థానం సంపాదించింది. కొన్నిసార్లు మన ఫేస్​బుక్ అకౌంట్ మనకు తెలియకుండానే హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి హ్యాకింగ్​ల బారిన పడకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ అకౌంట్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఈ అంశాలపై టెక్​నిపుణులు సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Facebook Hacked Account Recovery : సాంకేతికత రోజురోజుకు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే వేగంగా హ్యాకింగ్​ సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. సాధారణంగా మన స్నేహితులు ఫేస్​బుక్​లో పంపించే పోస్ట్​ల్లో స్పామ్​ మెసేజ్​లు కూడా ఉండే అవకాశం ఉంది. హ్యాకర్లు మన స్నేహితులకు స్పామ్​ లింకులను పంపవచ్చు. వారు వాటిని మనకు షేర్ చేసినప్పుడు.. మనం క్లిక్ చేయడం వలన మన సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఫేస్​బుక్​ మార్కెట్ ప్లేస్​లో అతి తక్కువ ధరకే వస్తువులు అమ్ముతున్నామని నమ్మించడం ఈ కాలంలో పెద్ద సమస్యగా మారింది. గ్రూప్​లలో వీటి గురించి పోస్ట్ చేసి, రిప్లై ఇవ్వాలని కోరుతుంటారు. వారు పంపిన వాటికి స్పందించడం వల్ల.. మన వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. మన ఫేస్​బుక్ అకౌంట్​ హ్యాక్ చేసిన వారు మన ప్రొఫైల్ వివరాలను, ఈ-మెయిల్ ఐడీని కూడా మార్చవచ్చు. ఇటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫేస్​బుక్ హ్యాక్ అయ్యిందా లేదా అని గుర్తించడం ఎలా?
How to Check if Your Facebook Account Was Hacked : మీ ఫేస్​బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందో? లేదో? తెలుసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అవి:

  1. లాగిన్ లొకేషన్ ఐడీని పరిశీలించడం.
  2. మీ పేమెంట్ హిస్టరీని చెక్ చేయడం.

ఈ రెండింటిలో దేని ద్వారా నైనా మీ ఫేస్​బుక్​ హ్యాక్ అయ్యిందా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు.

ఫేస్​బుక్ లాగిన్ లొకేషన్ అప్షన్ ద్వారా..
How to Check Your Facebook Login Locations : మొదట సెట్టింగ్స్​లో ప్రైవసీ అప్షన్​ని ఎంచుకోవాలి. అందులోని ఆక్టివ్​లాగ్ పైన క్లిక్ చేయాలి. తరువాత యాక్టివ్ ​సెషన్స్ ఆప్షన్​ని ఎంచుకోవాలి. అప్పుడు మన ఫేస్​బుక్ అకౌంట్ ఏయే డివైజ్​ల్లో యాక్టివ్​గా ఉంది అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఒకవేళ మీ ఫేస్​బుక్ అకౌంట్ పాస్​వర్డ్​ను హ్యాకర్ అప్పటికే మార్చి ఉంటే.. మీరు అకౌంట్​ను వీలైనంత వేగంగా రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది.

సెట్టింగ్స్​లో మీరు మీ ఫేస్​బుక్ లాగిన్ అకౌంట్​ను మేనేజ్ చేయవచ్చు. ఎవరైనా మీకు తెలియకుండా లాగిన్ అయినట్లయితే, వాటిని చాలా సులభంగా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ మన అకౌంట్ హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఫేస్​బుక్ ఖాతా సెక్యూరిటీ కోసం మనం 'లాగ్ అవుట్ ఆల్​ సెషన్స'​ ఆప్షన్​ను ఉపయోగించుకోవచ్చు.

పేమెంట్ హిస్టరీని చెక్ చేయండి
Checking Your Payment History on Facebook : మన ఫేస్​బుక్​ అకౌంట్​ను ఎవరైనా హ్యాక్ చేశారా? లేదా? అనే విషయం తెలుసుకోవడానికి మరో మార్గం ఉంది. అదే పర్చేస్​ హిస్టరీ. ఒక వేళ మీ క్రెడిట్ కార్డు వివరాలు ఫేస్​బుక్ ఖాతాలో స్టోర్ అయ్యుంటే.. హ్యాకర్లు మీ పేరుతో కొనుగోలు చేసి అకౌంట్ ఖాళీ చేసే అవకాశం ఉంది జాగ్రత్త!

ఒక వేళ మీరు ఏదైనా ఆన్​లైన్​ మోసాలకు గురైతే వెంటనే ఫేస్​బుక్ సపోర్ట్ టీమ్​ను సంప్రదించవచ్చు. వాస్తవానికి మీ ఫేస్​బుక్ ఖాతా ద్వారా అయినా వారిని సంప్రదించవచ్చు. లేదా ట్విట్టర్ అకౌంట్​ ద్వారా అయినా మీ సమస్యను వారికి తెలియజేయవచ్చు. వినియోగదారుల ఫిర్యాదుల పట్ల కంపెనీ ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందిస్తుంది.

ఏ విధంగా ఫిర్యాదు చేయాలి?
How to Report Your Hacked Facebook Account : ఖాతా హ్యాకింగ్, లేదా మరేదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. నేరుగా ఫేస్​బుక్ హ్యాకింగ్​కు సంబంధించిన రిపోర్టింగ్ పేజీలో ఫిర్యాదు చేయవచ్చు. ఆ సంస్థ ఎల్లప్పుడూ తమ ఖాతాదారుల వివరాలు సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం పనిచేస్తుంది. అకౌంట్ భద్రత కోసం నిరంతరం కొత్త పద్ధతులను అభివృద్ధి చేస్తోంది. హ్యాకింగ్​కు సంబంధించిన కంప్లైంట్​లు ఇవ్వడానికి facebook.com/hacked వెబ్​సైట్​లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. నకిలీ ఖాతాల గురించి కూడా అందులో కంప్లైంట్ చేయవచ్చు. ఫేస్​బుక్ ఖాతా, భద్రత గురించి ఎటువంటి సమస్యలు ఉన్నా.. బుల్లియింగ్ సెంటర్, సేఫ్టీ సెంటర్ పేజీలలో తెలుసుకోవచ్చు.

మన ఫేస్​బుక్ ఖాతా హ్యాక్ కాకుండా ఉండాలంటే?
How to Protect Your Facebook Account in Future : మన ఫేస్​బుక్​ ఖాతా హ్యాక్ కాకుండా ఉండాలంటే సాంకేతిక నిపుణులు సూచిస్తున్న కొన్ని మెళకువలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • మొదట మీ ఫేస్​బుక్ పాస్​వర్డ్​ను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి.
  • మీ మొబైల్, ల్యాప్​టాప్​ల నుంచి థర్డ్​పార్టీ యాప్​లను తొలిగించాలి.
  • ఒక వేళ మీ అకౌంట్ హ్యాక్ అయినట్లయితే.. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను వెంటనే అప్రమత్తం చేయాలి.
  • ఫేస్​బుక్ సంస్థ అధికారిక హ్యాండిల్స్​ ద్వారా ఫేస్​బుక్​ సపోర్ట్ టీమ్​కు హ్యాకింగ్ గురించి లేదా ఆన్​లైన్ మోసం గురించి ఫిర్యాదు చేయాలి.

మరిన్ని విలువైన టెక్నిక్​లు..
మన ఫేస్​బుక్ ఖాతా హ్యాకర్ల బారిన పడిన తరువాత బాధపడడం కంటే.. అసలు ముందుగానే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడంవల్ల మన అకౌంట్​ను సురక్షితంగా ఉంచుకోవచ్చో తెలుసుకుందాం.

స్ట్రాంగ్ పాస్​వర్డ్ ఉండాలి..
మీకు గుర్తుండే పాస్​వర్డ్​ను క్రియేట్ చేసుకొండి. అది ఇతరులు గుర్తించలేని విధంగా పెట్టుకొండి. ఫింగర్​ప్రింట్ ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల అకౌంట్​మరింత సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవేకాకుండా మరిన్ని సరికొత్త పద్ధతులు కూడా ఉన్నాయి. వాటికోసం ముందుగా సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. అకౌంట్ సెట్టింగ్స్​ను ఎంచుకోవాలి. అందులో పాస్​వర్డ్​ అండ్ సెక్యూరిటీ అప్షన్​ను క్లిక్ చేయాలి. లాగిన్ అలర్ట్స్​ను కూడా ఎంచుకోవచ్చు.

టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​
సెక్యూరిటీ సెట్టింగ్స్​లో భాగంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్​ను ఎనేబుల్​ చేసుకోవాలి. దీని వల్ల ఎవరైనా అపరిచితులు మన అకౌంట్​లో లాగిన్ కావడానికి ప్రయత్నిస్తే.. వారిని సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అందువల్ల ఇతరులు మన అకౌంట్​లోకి వెళ్లి మన సమాచారాన్ని తస్కరించే అవకాశం తగ్గుతుంది.

ఫేస్​బుక్ వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Take Precautions When Browsing Facebook :

  • ఫేస్​బుక్​లో వచ్చే లింక్​లపై క్లిక్ చేయకూడదు. అలా చేసినట్లయితే ఫిషింగ్ అటాక్ జరిగే అవకాశం ఉంది.
  • స్పామ్ లింక్​లపై కూడా క్లిక్ చేయరాదు.

హ్యాకర్లు కొన్ని సార్లు మనకు మోసపూరిత లింక్స్ పంపించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని క్లిక్ చేయకూడదు. కొన్ని నకిలీ వెబ్​సైట్స్ ఉంటాయి. వాటిలోకి మనం ఎంటర్ అయినట్లయితే వారు మన విలువైన సమాచారం మొత్తాన్ని తస్కరించే అవకాశం ఉంది. అటువంటి సైట్లలోకి ఎంటర్ అయినట్లయితే సెకన్లలో మన అకౌంట్ హ్యాక్ అవుతుంది.

మీ ప్రైవసీ సెట్టింగ్స్​ను చెక్​చేయండి
Adjust Your Facebook Privacy Settings : ఫేస్​బుక్​లో మన వ్యక్తిగత సమాచారం ఉండే ఫ్రొపైల్​ పేజీ, ఫోటోలు, పోస్టులు, ట్యాగ్స్​ను హైడ్ చేయాలి. ఇటువంటి ముఖ్యమైన అంశాలను అందరికీ కనిపించకుండా ఉండేలా చూసుకోవాలి. దానికోసం పలు సెట్టింగ్స్ ​ఫేస్​బుక్​లో ఉంటాయి. మన వ్యక్తిగత వివరాలు మనకు తెలిసిన వారితో మాత్రమే పంచుకోవాలి అంతే తప్ప వాటిని అందరూ చూసే విధంగా ఉంచకూడదు.

పైన తెలిపిన మార్గాల ద్వారా మన ఫేస్​బుక్​ను చాలా వరకు హ్యాకర్లబారిన పడకుండా చేయవచ్చు. ఏ పద్ధతి అయినా నూటికి నూరు శాతం కచ్చితమైనది అని హామీ ఇవ్వలేం. ఏది క్లిక్ చేయాలో, ఏది చేయకూడదో తెలిసిన నాడు మాత్రమే సురక్షితంగా ఉండవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.