ETV Bharat / lifestyle

శృంగారంతో జలుబు మాయం!

author img

By

Published : Jun 23, 2021, 12:43 PM IST

శృంగారంతో ఆనందం, సంతోషం, ఉత్సాహం చేకూరుతాయన్నది మనకు తెలిసిందే. అయితే ఇది ఒక వ్యాయామంగానూ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ఒత్తిడి తగ్గటానికీ తోడ్పడుతుంది. అంతేకాదు.. జలుబు రాకుండానూ శృంగారం కాపాడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

sex benefits, sex with health
శృంగారంతో జలుబు మాయం!

శృంగారం చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసా మీకు? సెక్స్​ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. తెలివితేటలు కూడా పెరుగుతాయట. మెదడులో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. సెక్స్​లో పాల్గొనడం వల్ల బ్రెయిన్​కు ఆక్సిజన్​ ఎక్కువగా చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.

సెక్స్​ చేయడం వల్ల ఒంట్లో కొవ్వు తగ్గుతుందని.. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా దోహదం చేస్తుందని పలు అధ్యయనాలు గతంలో పేర్కొన్నాయి. శృంగారం చేయడం వల్ల గుండెపోటు ముప్పు కూడా తగ్గుతుందని తేలింది. పలు వైరస్​ల బారి నుంచి ఎదుర్కొవడానికి సెక్స్​ సహకరిస్తుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఆ కార్యం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. వారంలో ఒకసారి లేదా రెండు సెక్స్​ చేసుకునే వారిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని రీసెర్చ్​ ద్వారా తేలింది.

ఇప్పుడు తాజాగా మరో కొత్త విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జలుబు రాకుండా కూడా శృంగారం కాపాడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో.. జలుబుతో పోరాడే యాంటీబాడీలో పెద్దమొత్తంలో ఉంటాయంట. కనుక సెక్స్​ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

ఇదీ చూడండి: Bollywood: డీగ్లామర్​ బ్యూటీ​స్.. ఒంటినిండా బురదతో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.