ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

author img

By

Published : Dec 4, 2020, 10:05 PM IST

Updated : Dec 5, 2020, 8:30 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో 326 కేజీల అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గద్దలగూడెం గ్రామ సమీపంలో రూ.7 లక్షల విలువైన గంజాయిని కార్యదళం పోలీసులు పట్టుకున్నారు.

Seizure of smuggled marijuana in khammam and bhadradri kothgudem districts
అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దాదాపు రూ.50 లక్షల విలువైన 326 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జగ్గారం క్రాస్​రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని మల్కాన్​గిరి జిల్లా నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో గంజాయి స్వాధీనం:

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గద్దల గూడెం గ్రామ సమీపంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ.7 లక్షల విలువైన 50 కేజీల గంజాయిని కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వైజాగ్ బాబు అనే వ్యక్తి ఆటోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని అక్రమంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు తరలిస్తున్నట్లు ఏసీపీ వెంకట్రావు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఏసీబీ వలకు చిక్కిన ఉప గణాంక అధికారి

Last Updated : Dec 5, 2020, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.