ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం

author img

By

Published : Dec 11, 2020, 2:18 PM IST

Seized eight quintals of black jaggery moving illegally in mahaboobabad dist
అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం స్వాధీనం

మహబూబాబాద్ జిల్లాలో భారీ ఎత్తున నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసముద్రం శివారులో ఎక్సైజ్​ కార్యదళం సిబ్బంది తనిఖీలు చేస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 8 క్వింటాళ్ల బెల్లం, 20 కేజీల పట్టిక, పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం శివారులో ఇన్నోవాలో అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లాన్ని ఎక్సైజ్​ కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది క్వింటాళ్ల నల్లబెల్లం, 20 కేజీల పట్టిక, పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్​ చేశారు.

చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లికి చెందిన నట్టే రవికిరణ్​ను అరెస్ట్ చేశారు. జిల్లాలో గుడుంబా, బెల్లం, గంజాయిల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.