ETV Bharat / jagte-raho

మద్నూర్​ కానిస్టేబుల్​పై సస్పెన్షన్ వేటు

author img

By

Published : Apr 25, 2020, 2:51 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో పోలీసు యంత్రాంగం అలుపెరగకుండా శ్రమిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. మరో పక్క ఆ శాఖలోనే కొందరు అక్రమార్కులు మామూళ్లకు అలవాటుపడి శాఖకు అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు.

madnoor constable suspended due to taking bribe
మద్నూర్​ కానిస్టేబుల్​పై సస్పెన్షన్ వేటు

కరోనా వ్యాప్తి నివారణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులపై గతంలో విమర్శలు చేసిన వారు ఇప్పుడు అభినందిస్తున్నారు. కానీ కొందరు అధికారులు మాత్రం ఆ శాఖకు అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ ఠాణాలో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ అక్రమంగా ఇసుక రవాణా చేసే వ్యక్తితో తనకు ఇవ్వాల్సిన డబ్బులు కూరగాయలు దుకాణంలో ఇవ్వాలని సాగిస్తున్న సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ సంఘటనపై పోలీసు శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. పూర్తి విచారణ చేసి సదరు కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్​పై సస్పెన్షన్ వేటు వేసినట్లు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.