ETV Bharat / jagte-raho

పచ్చనోట్ల కోసం నిత్యకల్యాణం.. పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ

author img

By

Published : Dec 3, 2020, 4:35 PM IST

Updated : Dec 3, 2020, 5:31 PM IST

dubai bridegroom cheated Hyderabad bride
పచ్చనోట్ల కోసం నిత్యకల్యాణం

మ్యాట్రిమోని ద్వారా అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్నానని, వారి కుమార్తెను కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. రూ.30 లక్షలు కట్నం తీసుకుని బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత భార్యను దుబాయ్ తీసుకెళ్లాడు. అప్పుడు బయటపడింది ఆ ప్రబుద్ధుని అసలు బాగోతం...

హైదరాబాద్​కు చెందిన ఓ అమ్మాయికి మ్యాట్రిమోని ద్వారా దుబాయ్​లో ఉద్యోగం చేస్తున్న వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రూ.30 లక్షలు కట్నం తీసుకున్న పవన్​కుమార్.. పెళ్లి తర్వాత ఆమెను దుబాయ్​ తీసుకెళ్లాడు.

దుబాయ్​ వెళ్లిన తర్వాత పవన్ కుమార్ అసలు బాగోతం బయటపడింది. తనకు ఇంతక్రితమే ముగ్గురితో వివాహం జరిగిందని.. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారనే విషయాన్ని పవన్​ తనతో చెప్పాడని బాధితురాలు తెలిపింది. ఎందుకు మోసం చేశావని నిలదీసినందుకు.. దుబాయ్​లో తనపై పలుమార్లు హత్యాయత్నం చేశాడని వెల్లడించింది.

తల్లిదండ్రుల సాయంతో స్వదేశానికి చేరుకున్న బాధితురాలు.. పవన్​కుమార్​పై హైదరాబాద్ సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు ఉపసంహరించుకోవాలని.. అత్తమామలు, పవన్ స్నేహితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. పవన్ స్నేహితులు.. తన ఈ-మెయిల్, ఫోన్ హ్యాక్​ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇలాంటి అన్యాయం మరే మహిళకు జరగకుండా పవన్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated :Dec 3, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.