ETV Bharat / jagte-raho

పెళ్లి మాటున మోసం.. అదేమని అడిగితే హత్యాయత్నం!

author img

By

Published : Oct 22, 2020, 6:58 PM IST

a government teacher cheated his wife in nizamabad
నిలదీసినందుకు మహిళా ఉద్యోగిపై దాడి.. కాపాడిన ఐద్వా

పెళ్లి చేసుకున్నాడు. భార్య జీతం వాడుకున్నాడు. ఆమె పేరు మీద వ్యక్తిగత లోన్​ తీసుకున్నాడు. చివరికి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటని నిలదీసినందుకు ఆమెపై అతని కుటుంబ సభ్యులు దాడికి దిగారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

పెళ్లి చేసుకొని మోసం చేసి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నిలదీసినందుకు బాధితురాలిపై హత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన బాధితురాలు ఐద్వా సంఘానికి తన గోడు వెల్లబోసుకుంది.

నిజామాబాద్​కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనంతరాజ్​ ఓ మహిళా ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలి నెల జీతం వాడుకోవడమే కాకుండా, నూతన ఇంటి నిర్మాణం కోసం ఆమె పేరు మీద బ్యాంకు లోన్​ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఆమెని మోసం చేయాలని భావించి భార్య పేరు మీద వ్యక్తిగత లోన్​ తీసుకున్నాడు. ఇవన్నీ చేశాక బెంగళూరుకి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు ఇదేంటని నిలదీసి కేసు పెట్టింది. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై అనంతరాజ్​ అన్న, అక్కలు, రెండో భార్య తండ్రి కలిసి ఆమెని ఆర్యనగర్​లోని తన ఇంట్లో నిర్బంధించి బెదిరించారు. బాధితురాలిపై దాడికి పాల్పడి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం లాక్కున్నారు.

మీడియా సహకారంతో

చివరికి బాధితురాలిని హత్య చేయాలని యత్నిస్తుండగా తప్పించుకొని వేరే గదిలోకి వెళ్లి ఐద్వా మహిళా సంఘానికి ఫోన్​ ద్వారా సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న మహిళా సంఘం సభ్యులు మీడియా సమక్షంలో రక్షించారు.

అనంతరాజ్​ని కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బని లత డిమాండ్​ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలి భర్తకి దేహశుద్ధి

ఇదీ చదవండి: లేహ్ మాదే.. ట్విట్టర్ సీఈఓకు కేంద్రం ఘాటు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.