ETV Bharat / international

Ukraine Crisis: కిరాయి సైనికులతో డాన్​బాస్​పై రష్యా గురి!

author img

By

Published : Apr 4, 2022, 9:08 PM IST

Ukraine Crisis
డాన్​బాస్​పై గురిపెట్టిన రష్యా

Ukraine Crisis: తూర్పు ఉక్రెయిన్​ ప్రాంతంలోని డాన్​బాస్​పై రష్యా తన బలగాలను మోహరిస్తోందని బ్రిటన్​ రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఇంటిలిజెన్స్ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది.

Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్​ల మధ్య భీకరమైన దాడి కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే తూర్పు ఉక్రెయిన్​ ప్రాంతంలోని డాన్​బాస్​పై రష్యా తన బలగాలను మోహరిస్తోందని బ్రిటన్​ రక్షణమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ఇంటిలిజెన్స్​.. సోషల్ మీడియాలో తెలిపింది. వాగ్నర్​ ప్రైవేట్​ మిలిటరీ గ్రూప్​కు చెందిన కిరాయి సైనికులతో కలిసి రష్యా దళాలు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది.

రష్యా ఇప్పటికే దక్షిణ ఓడరేవు నగరమైన మరియుపోల్​ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. "గత కొన్ని వారాలుగా రష్యా, ఉక్రెయిన్​ మధ్య భీకరయుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్​ దళాలు మాత్రం గట్టిగా ప్రతిఘటిస్తూ.. తమ ప్రాంతాలను నియంత్రణలో ఉంచుకుంటున్నాయి" అని తెలిపింది. మరియుపోల్​ అనేది రష్యాకు కీలక లక్ష్యం. ఇది రష్యా నుంచి దాని ఆక్రమిత క్రిమియా భూభాగానికి మధ్య కారిడార్​గా పనిచేస్తుంది.

ఇదీ చదవండి: రష్యా 'మారణహోమం'.. శవాల గుట్టగా మారిన 'బుచా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.