ETV Bharat / international

హోటల్​పై ముష్కరుల దాడి, 20 మంది దుర్మరణం

author img

By

Published : Aug 20, 2022, 1:47 PM IST

Updated : Aug 20, 2022, 10:29 PM IST

.
.

Somalia Hotel attack 2022 సోమాలియా రాజధాని మొగాదిషూలో ఉగ్రదాడులు రెచ్చిపోయారు. హయత్​ హోటల్​పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో 20 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

Somalia Hotel attack 2022: సోమాలియా రాజధాని మొగాదిషూలోని హయత్​ హోటల్​పై ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇస్లామిక్​ తీవ్రవాదులు కాల్పులు జరపగా కనీసం 20 మంది మరణించగా, మరో 40 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించాయి భద్రతా బలగాలు.

కాల్పులకు ముందు తీవ్రవాదులు హోటల్​ బయట​ బాంబుదాడులు జరిపారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హోటల్​కు చేరుకున్నారు. అప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉండడం వల్ల పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్లో ఉగ్రవాదుల మారణకాండతో.. క్షతగాత్రులను రక్షించే ప్రయత్నాలు చేశారు. పోలీసుల రాకతో అప్రమత్తమైన తీవ్రవాదులు హోటల్​లోని టాప్ ఫ్లోర్​కు చేరుకున్నారు. అక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. ఈ దాడికి అల్​ఖైదా అనుబంధ సంస్థ అల్​-షాబాద్​ ఇస్లామిక్​ మిలిటెంట్స్​ బాధ్యత వహించింది. ప్రభుత్వ అధికారులు తరచూ సందర్శించే ప్రదేశాలపై దాడులు జరపాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది. మరోవైపు ఆ దాడిని యూఎస్ ఎంబసీ ఖండించింది.

"మేము హోటల్ లాబీ దగ్గర టీ తాగుతుండగా, మొదటి పేలుడు జరిగి కాల్పుల శబ్దం వినిపించింది. హోటల్లోని రిసెప్షన్​ వద్ద మృతదేహాలు పడి ఉండడం వల్ల నేను వెంటనే గ్రౌండ్ ఫ్లోర్‌లోని హోటల్ గదిలోకి వెళ్లి లాక్​ చేసుకున్నాను"
-ప్రత్యక్ష సాక్షి అబ్దుల్లా హుస్సేన్

కాగా, హయత్ హోటల్‌పై దాడిని భారత్ ఖండించింది. ఈ దాడి ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా పేర్కొంది. ముష్కరుల దాడిలో మరణించినవారికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. సోమాలియాకు భారత్​ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​తో శాంతి అంటూనే కశ్మీర్​పై పాక్ ప్రధాని మెలిక

షాక్‌ థెరపీలతో ఉద్యమకారులకు చైనా చిత్రహింసలు

Last Updated :Aug 20, 2022, 10:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.