ETV Bharat / international

అధ్యక్ష ఎన్నికల ఫలితాల కేసులో ట్రంప్​కు చుక్కెదురు- పిటిషన్​ను తిరస్కరించిన కోర్ట్

author img

By PTI

Published : Dec 2, 2023, 10:14 AM IST

Updated : Dec 2, 2023, 10:44 AM IST

Donald Trump Election Case
Donald Trump Election Case

Donald Trump Election Case : 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న కేసులో డొనాల్డ్ ట్రంప్​పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్ కోర్టు తిరస్కరించి. దీంతో ట్రంప్​కు చుక్కెదురైంది.

Donald Trump Election Case : 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశారన్న కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని రిపబ్లికన్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫెడరల్‌ జడ్జ్‌ తన్యా చుకుతాన్‌ తిరస్కరించారు. మాజీ అధ్యక్షుడి హోదాలో ఎలాంటి రక్షణలు ఉండవని, ఈ కేసులో విచారణ ఎదుర్కొవాల్సిందేనని జడ్జ్‌ రూలింగ్‌ ఇచ్చారు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు, నేరారోపణ, విచారణ, అభియోగాల నమోదు, దోషి, ఏదైనా నేరపూరిత చర్యలకు సంబంధించి శిక్ష విధించే విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుందని జడ్జ్‌ పేర్కొన్నారు.

ఈ కేసు విచారణ మార్చిలో జరగనుండగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో తీసుకున్న నిర్ణయమైనందున.. విచారణ నుంచి మినహాయిస్తూ ఈ కేసును కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ తీర్పు నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడి అధికారాల పరిధిపై న్యాయ పోరాటానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఈ తీర్పును ట్రంప్‌ న్యాయవాదులు అప్పీల్‌ చేసే అవకాశం ఉంది.

అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల సందర్బంగా జార్జియా ఫలితాలను తారుమారు చేయడానికి ట్రంప్ ప్రయత్నించినట్లు.. ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అలానే 2021 జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే ఈ సమావేశం జరగడానికి కొద్దిగంటల ముందు ట్రంప్‌ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. దీంతో ట్రంప్‌ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో డొనాల్డ్ ట్రంప్​పై కేసు నమోదైంది. కాగా ఇరాన్​ దాడికి సంబంధించిన అత్యంత రహస్య దస్త్రాలను తన ఇంట్లో దాచిపెట్టారనే కేసు, పోర్న్‌ స్టార్‌కు డబ్బు చెల్లింపులు ఇలా ఈ ఏడాదిలో ట్రంప్​పై నాలుగు సార్లు నేరాభియోగాలు నమోదయ్యాయి.

Trump On Gaza Refugees : 'అధికారంలోకి వస్తే గాజా శరణార్థులపై నిషేధం.. సానుభూతిపరులకు నో ఎంట్రీ'

Donald Trump Arrest : ట్రంప్​ మళ్లీ అరెస్ట్​.. 20నిమిషాల పాటు జైలులో.. తొలిసారి 'మగ్​షాట్​' రిలీజ్​

Last Updated :Dec 2, 2023, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.