ETV Bharat / international

పుతిన్ సన్నిహితుడి కుమార్తె హత్య, కారు బాంబు పేల్చి

author img

By

Published : Aug 21, 2022, 3:00 PM IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​కు అత్యంత సన్నిహితుడైన అలెగ్జాండర్ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి హత్య చేశారు. ఈ ఘటన మాస్కోలో శనివారం జరిగింది.

putin
పుతిన్ సన్నిహితుడు కుమార్తె హత్య

పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన సహాయకుడు అలెగ్జాండర్‌ డుగిన కుమార్తెను కారు బాంబు పేల్చి మాస్కోలో హత్య చేశారు. పుతిన్‌ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తిగా అలెగ్జాండర్‌కు పేరుంది. వాస్తవానికి అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేయగా.. అతడి కుమార్తె డార్యా డుగిన మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటన రష్యా కాలమానం ప్రకారం శనివారం జరిగినట్లు ఆ దేశ వార్తా సంస్థ టాస్‌ పేర్కొంది.

డార్యా తన కారులో ఇంటికి బయల్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు జరిగింది. దాడిలో ధ్వంసమైన కారు వాస్తవానికి అలెగ్జాండర్‌ది. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి అలెగ్జాండర్‌ వాదన కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్‌ను అలెగ్జాండర్‌ బాగా ప్రభావితం చేశారు. అలెగ్జాండర్‌ కుమార్తె డార్యా కూడా రచయిత. ఆమె పూర్తిగా సంప్రదాయవాది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన అమెరికా ట్రెజరీస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారెన్‌ అసెట్స్‌ ఆంక్షల జాబితాలో డార్యా కూడా ఉన్నారు. ఆమె ఉక్రెయిన్‌పై రాసిన వ్యాసం కారణంగా ఈ జాబితాలో చేర్చారు.

ఇవీ చదవండి: పాక్​లో భారీ వర్షాలకు 36 మంది బలి, వేలాది ఇళ్లు ధ్వంసం

సెకండ్​ హ్యాండ్​ స్మోక్​తో క్యాన్సర్​ ముప్పు ఎక్కువే, వేలల్లో మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.