ETV Bharat / international

పాక్​లో భారీ వర్షాలకు 36 మంది బలి, వేలాది ఇళ్లు ధ్వంసం

author img

By

Published : Aug 21, 2022, 2:04 PM IST

కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. సింధ్, పంజాబ్ రాష్ట్రాల్లో 36 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Etv Bharat
Etv Bharat

కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ధాటికి 24 గంటల్లో 36 మంది మరణించారు. మరో 145 మంది గాయపడ్డారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ విషయం తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నట్లు వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు, వలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపింది.

దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో 18 మంది మరణించగా, 128 మంది గాయపడ్డారు. వాయవ్య ఖైబర్​ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో ఏడుగురు చనిపోయారు. దేశంలో వరదలు వల్ల ఇప్పటివరకు 27,870 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 10,860 ఇళ్లుగా పూర్తిగా .. 17,010 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

--జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ

సింధ్, కరాచీ లాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో సైనిక దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆర్మీ రెస్క్యూ టీమ్‌లు సింధ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ పంపిణీ చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు జూన్​ నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు కారణంగా మరణించిన వారి సంఖ్య 728కు చేరుకుంది. మృతుల్లో 263 మంది చిన్నారులు ఉండగా, 156 మంది మహిళలు ఉన్నారు. 1,291 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 1,16,771 ఇళ్లు దెబ్బతిన్నాయి. 129 వంతెనలు, 50 దుకాణాలు ధ్వంసమయ్యాయి.

ఇవీ చదవండి: సెకండ్​ హ్యాండ్​ స్మోక్​తో క్యాన్సర్​ ముప్పు ఎక్కువే, వేలల్లో మరణాలు

కిమ్ ఎమోషనల్, కంటతడి పెట్టించేలా స్పీచ్, అసలేమైందంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.