ETV Bharat / international

అక్కడ వంట నూనె ధర ఒకేసారి రూ.213 పెంపు.. లీటర్​ ఎంతంటే?

author img

By

Published : Jun 1, 2022, 2:17 PM IST

cooking oil price in Pakistan
వంట నూనె

cooking oil price in Pakistan: ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న కారణంగా పాకిస్థాన్​లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనె లీటర్​కు ఒకేసారి రూ.213, నెయ్యి కిలోకు రూ.208 పెంచింది కొత్త ప్రభుత్వం. దీంతో వాటి ధరలు జీవిత కాల గరిష్ఠాలను తాకాయి. ప్రస్తుతం లీటర్​ వంట నూనె ఎంతంటే?

cooking oil price in Pakistan: పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో దాయాది పాకిస్థాన్​ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోంది. ధరల పెరుగుదలతో శ్రీలంక పరిస్థితిని తలపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె, నెయ్యి ధరలను ఒకేసారి వరుసగా లీటరుకు రూ.213, రూ.208 పెంచింది. దీంతో నెయ్యి లీటర్​కు రూ.555, వంట నూనె రూ.605కు చేరి జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. ధరల పెంపును యుటిలిటీ స్టోర్స్​ కార్పొరేషన్​(యూఎస్​సీ) ధ్రువీకరించిందని, పెరిగిన కొత్త ధరలు జూన్​ 1 బుధవారమే అమలులోకి వచ్చినట్లు పాకిస్థాన్​ మీడియా వెల్లడించింది. అయితే, ఒకేసారి ఈ స్థాయిలో ధరల పెంపు ఎందుకు చేపట్టారనే దానిపై సంబంధిత మంత్రిత్వ శాఖ సమాధానం ఇవ్వలేదని పేర్కొంది.

ధరల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్​ వనస్పతి తయారీ సంఘం(పీవీఎంఏ) సెక్రెటరీ జనరల్​ ఉమర్​ ఇస్లామ్​ ఖాన్​. వంట నూనెల రిటైల్​ ధరలు త్వరలోనే యూఎస్​సీ స్థాయికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 'నెయ్యి, వంట నూనెలను తయారీ దారులు యూఎస్​సీకి అప్పుగా ఇవ్వటం ఆపేశారు. వారికి సుమారు రూ.2-3 బిలియన్లు చెల్లించాల్సి ఉంది. పామ్​ ఆయిల్​ సరఫరాపై ఏర్పాటైన ప్రధాని టాస్క్​ఫోర్స్​ కమిటీ ఇటీవలే ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. దేశంలో పామ్​ఆయిల్​ డిమాండ్​, సరఫరాలపై విశ్లేషించింది.' అని తేలిపారు.

వంట నూనెల్లో దేశీయ అవసరాలకు అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది పాకిస్థాన్​. ఇండోనేసియా నుంచి 87శాతం, మలేసియా నుంచి 13 శాతం వంట నూనెలు దిగుమతి అవుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. పీవీఎంఏ సెక్రెటరీ ప్రకారం.. కరాచీలో ప్రస్తుతం 1,60,000 టన్నుల పామ్​ ఆయిల్​ నిల్వలు ఉన్నాయి. అవి మరో మూడు వారాలకు సరిపోతాయి.

మరోవైపు.. దేశంలో గోధుమ పిండి ధర కిలోకు రూ.65కు చేరింది. గ్యాస్​ ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్​ ధరల పెరుగుదలకు కారణం రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంగా చెబుతున్నప్పటికీ అంతకు ముందు నుంచే ధరలు ముండిపోతున్నాయి. ఈ తరుణంలో ధరలను తగ్గిస్తామని ఇటీవల ప్రధానిగా బాధ్యలు చేపట్టిన షెహ్​బాజ్​ షరీఫ్​ హామీ ఇచ్చారు. తన దుస్తులు విక్రయించైనా సరే.. ధరలు తగ్గిస్తానంటూ వ్యాఖ్యానించారు.

వస్తువు

ప్రస్తుత ధర

(రూ.)

పెరిగిన ధర

(రూ.)

సోయా సుప్రీం వనస్పతి

కిలో ప్యాకెట్

312520

సోయా సుప్రీం వనస్పతి

5కిలోలు టిన్​

1,567 2,605

సోయా సుప్రీం వంట నూనె

లీటర్​ ప్యాకెట్

319532

సోయా సుప్రీం వంట నూనె

5 లీటర్ల టిన్

1,5822,640

ఇదీ చూడండి: లీటర్ పెట్రోల్ ధర రూ.30 పెంపు- మోదీపై మాజీ ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.