ETV Bharat / international

భారీ వరదలకు కుప్పకూలిన ఇంటి గోడ- ఒకే కుటుంబంలోని 10మంది సహా 22మంది మృతి!

author img

By PTI

Published : Dec 27, 2023, 8:52 AM IST

Updated : Dec 27, 2023, 10:37 AM IST

Congo Flood Death Toll
Congo Flood Death Toll

Congo Flood Death Toll : కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సెంట్రల్​ కాంగో ప్రావిన్స్​లో వరదల కారణంగా గోడకూలి ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సహా మొత్తం 22 మంది మృతి చెందారు.

Congo Flood Death Toll : కాంగోలోని సెంట్రల్ ప్రావిన్స్​లో సంభవించిన భారీ వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 10 మందితో సహా 22 మంది మరణించారు. కనంగా జిల్లాలోని ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా వెల్లడించారు.

ఇంటి గోడ కూలిపోవడం వల్ల బికుకులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారని కబేయా తెలిపారు. తొలుత వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 17గా గుర్తించామని చెప్పారు. మంగళవారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో గోడలు కూలిన ఘటనలో పలువురు మృతి చెందినట్లు వెల్లడించారు.

డిసెంబర్‌ తొలి వారంలో కూడా కాంగోలోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 14 మంది మృతి చెందారు. మే నెలలో కురిసిన వర్షాల కారణంగా కాంగో దక్షిణా కివూ ప్రావిన్స్​లో 400 మంది మరణించారు. కొండచరియలు భారీ విరిగిపడడం వల్ల భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. కాంగోలో తరచుగా వరదలు సంభవిస్తూనే ఉంటాయి.

లిబియా జలప్రళయానికి -20 వేల మంది బలి
కొన్ని రోజుల క్రితం ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్‌ తుపాన్‌ జలప్రళయం సృష్టించింది. వర్షాల కారణంగా రెండు డ్యామ్​లు బద్దలవ్వడం వల్ల దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తింది. దీంతో భారీగా వరదలు సంభవించడం వల్ల ఇప్పటివరకు 5,300 మంది మరణించగా మరో 10 వేల మంది గల్లంతయ్యారు. మొత్తంగా ఈ ప్రళయంలో 18వేల నుంచి 20వేల వరకు మృతి చెంది ఉండొచ్చని అంచనా వేశారు.

ఈ ఘోర విపత్తు కారణంగా సుమారు 5,300 మంది మరణించారు. ఇప్పుడు ఆ మృతదేహాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. ఓడరేవు నగరమైన డెర్నా శ్మశానంగా మారిపోయింది. దాదాపు రెండు అంతస్తుల వరకు వరద నీరు వచ్చిందని మహిళలు, పిల్లలు ఆ వరదలో కొట్టుకుపోయారని డెర్నాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మొహమ్మద్‌ తెలిపారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Brazil Floods 2023 : భారీ వరదలు.. 31 మంది మృతి.. జలదిగ్బంధంలో 60 నగరాలు..

Libya Floods : లిబియాలో ప్రకృతి ప్రకోపం.. 2వేల మంది బలి.. వేలాది మంది గల్లంతు

Last Updated :Dec 27, 2023, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.