ETV Bharat / international

బంగ్లా ప్రధాని పీఠం హసీనాదే- వరుసగా నాలుగోసారి విజయం- 200 సీట్లు కైవసం

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 6:48 AM IST

Updated : Jan 8, 2024, 7:19 AM IST

Bangladesh Election Result 2024 : బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా పార్టీ ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది.

bangladesh-election-result-2024-
bangladesh-election-result-2024-

Bangladesh Election Result 2024 : బంగ్లాదేశ్‌ ప్రస్తుత ప్రధాని షేక్‌ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా ఐదోసారి ఆ దేశ పగ్గాలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో షేక్‌ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ మూడింట రెండొంతుల మెజార్టీ సాధించింది. పార్లమెంట్​లో 300 స్థానాలకు గానూ 299 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా అవామీ లీగ్ 200 సీట్లలో గెలిచిందని ఎన్నికల సంఘం ప్రతినిధి వెల్లడించారు. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. 'ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా అవామీ లీగ్​ను విజేతగా ప్రకటిస్తున్నాం. మిగిలిన నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తయ్యాక తుది ఫలితాలు వెల్లడిస్తాం' అని ఎలక్షన్ కమిషన్ ప్రతినిధి వివరించారు.

వరుసగా ఎనిమిదోసారి విజయం
ప్రధాని షేక్‌ హసీనా తాను పోటీ చేసిన గోపాల్‌గంజ్‌-3 స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2,49,965 ఓట్లు వచ్చాయి. ఆమె సమీప అభ్యర్థి బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన ఎం నిజాముద్దీన్ లష్కర్​కు 469 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 1986 నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిదోసారి ఆ స్థానం నుంచి విజయం సాధించారు హసీనా.

విపక్షాల బాయ్​కాట్- 40 శాతమే ఓటింగ్
మొత్తం 300 స్థానాలకుగాను ఆదివారం 299 సీట్లకు జరిగిన పోలింగ్‌ హింసాత్మక ఘటనల మధ్య ముగిసింది. తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలనే డిమాండ్‌తో ప్రధాని ప్రతిపక్షం BNPసహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ 40 శాతమే నమోదైంది. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతం మందికి పైగా ప్రజలు ఓటేశారు.

తమ బాయ్​కాట్ ఉద్యమం ఫలించిందని, అందుకే ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయిందని బీఎన్​పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికలు నిర్వహించిన తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. అయితే, విపక్షాల బహిష్కరణ పిలుపును ప్రజలు తిరస్కరించారని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్ చెప్పుకొచ్చారు. హింస, ఉగ్రవాదాన్ని ఎదురించి ఎన్నికల్లో పోరాడిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అంతకుముందు, బీఎన్​పీపై షేక్ హసీనా సైతం విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆ పార్టీకి, కూటమికి విశ్వాసం లేదని అన్నారు.

ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్​లో హింస- రైలుకు నిప్పు- నలుగురు సజీవదహనం

మోదీపై వ్యాఖ్యలు- ముగ్గురు మాల్దీవుల మంత్రులు సస్పెండ్?

Last Updated : Jan 8, 2024, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.