ETV Bharat / international

అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ వేలానికి

author img

By

Published : May 5, 2021, 5:46 AM IST

Wine that went to space for sale with $1 million price tag
అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ వేలానికి

అంతరిక్షంలో పులియబెట్టిన వైన్ సీసాను వేలానికి పెట్టింది ఓ సంస్థ. భూమి మీద పులియబెట్టిన వైన్​తో పోలిస్తే అంతరిక్ష వైన్.. అత్యంత సువాసనభరితంగా, మృదువుగా ఉందని ఆ సంస్థ చెబుతోంది. ఇది రూ. కోట్ల ధర పలకొచ్చని భావిస్తోంది.

అది అంతరిక్షంలో పులియబెట్టిన వైన్. దాని ధర కూడా అందనంత ఎత్తులో ఉంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఏడాదికి పైగా గడిపిన ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్​ను క్రిస్టీస్ సంస్థ వేలానికి పెట్టింది. ఇది 10 లక్షల డాలర్లు (దాదాపు రూ.7.37కోట్లు) పలకొచ్చని భావిస్తోంది.

ఈ సీసా పేరు 'పెట్రస్ 2000'. 2019నవంబరులో అంతరిక్షంలోకి పంపిన 12 వైన్ సీసాల్లో ఇదొకటి. భూమికి వెలుపల సేద్యానికి అవకాశాలపై పరిశోధనలో భాగంగా ప్రైవేటు అంకుర పరిశ్రమ 'స్పేస్ కార్గో అన్​లిమిటెడ్' వీటిని అక్కడికి పంపింది. 14 నెలల తర్వాత వాటిని భూమికి రప్పించింది.

వీటికి ఫ్రాన్స్​లోని బోర్డోలో ఉన్న 'ఇన్​స్టిట్యూట్ ఫర్ వైన్ అండన్ వైన్ రీసెర్చ్'​లో పరిశోధకులు రుచి పరీక్షలు నిర్వహించారు. భూమిపై అంతేకాలం పాటు పులియబెట్టిన వైన్​తో దీన్ని పోల్చి చూశారు. రుచిలో రెండింటి మధ్య వైరుధ్యం ఉందని చెప్పారు. రోదసిలోకి వెళ్లొచ్చిన పానీయం మృదువుగా, సువాసనభరితంగా ఉందన్నారు. శూన్య గురుత్వాకర్షణ కూడిన ప్రత్యేక వాతావరణంలో ఈ వైన్ పరిపక్వానికి వచ్చిందని క్రిస్టీస్ వైన్ అండన్ స్పిరిట్స్ విభాగం డైరెక్టర్ టిమ్ ట్రిప్​ట్రీ చెప్పారు. దీంతో ఈ సీసా ధర పెరిగిపోయిందని తెలిపారు.

ఇదీ చదవండి: భారత్​తో బ్రిటన్​ భారీ వాణిజ్య ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.