ETV Bharat / international

రైతుల నిరసనలపై బ్రిటన్​ ప్రధాని తికమక

author img

By

Published : Dec 10, 2020, 7:10 AM IST

UK PM in Parliament confuses farmers' protest with India-Pak dispute
రైతు నిరసనలపై బ్రిటన్​ ప్రధాని తికమక

భారత్​లో రైతులు చేస్తున్న ఆందోళనపై బ్రిటన్​లోని ప్రతిపక్ష పార్టీ ఎంపీ తన్​మన్​జీత్​ సింగ్ థేసి.. పార్లమెంట్​ వేదికగా ఆ దేశ ప్రధానిని ప్రశ్నించారు. అయితే తికమకపడిన జాన్సన్​.. అందుకు సమాధానంగా భారత్​-పాకిస్థాన్​ సమస్యపై మాట్లాడారు.

భారత్​కు సంబంధించిన రెండు వేరువేరు విషయాలపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్ ఆ దేశ పార్లమెంట్​లో మాట్లాడుతూ.. కొంత తికమకకు గురైయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేత తన్​మన్​జీత్​ సింగ్ థేసి అడిగిన ఓ ప్రశ్నకు వేరే సమాధానం ఇచ్చారు. దీనిపై థేసి ట్విట్టర్​లో బోరిస్​పై ఛలోక్తులు విసిరారు.

ఇదీ జరిగింది...

భారత్​లో రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని లేబర్​ పార్టీ ఎంపీ తన్​మన్​జీత్​ సింగ్ థేసి.. ప్రధాని బోరిస్​ జాన్సన్​ను కోరారు. ఇందుకు సమాధానంగా భారత్​, పాకిస్థాన్​ల మధ్య వివాదాన్ని ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

దీనిపై థేసి ట్వీట్​ చేశారు. 'మా ప్రధాని మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మీకు తెలిస్తే చెప్పి కొంచెం సహాయపడండి,' అని ఛలోక్తులు విసిరారు.

ఇదీ చూడండి: 'భారత రైతుల'కు మద్దతుగా బ్రిటన్​ ఎంపీల లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.