ETV Bharat / international

'భారత రైతుల'కు మద్దతుగా బ్రిటన్​ ఎంపీల లేఖ

author img

By

Published : Dec 5, 2020, 7:16 PM IST

భారత్​లో కొనసాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు బ్రిటన్​ ఎంపీలు. మొత్తం 36 మంది ఎంపీలు.. లేబర్ పార్టీకి చెందిన తన్మంజిత్ సింగ్ థేసీ నేతృత్వంలో కూటమిగా ఏర్పడి బ్రిటిష్​ విదేశాంగ కార్యదర్శి డొమినిక్​ రాబ్​కు లేఖ రాశారు.

36 cross party uk mps support indian farmers agitation
రైతులకు మద్దతుగా నిలిచిన బ్రిటన్​ ఎంపీ

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలపై వెంటనే భారత్​తో చర్చించాలని 36 మంది బ్రిటన్​ ఎంపీలు ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. ఇందులో భారత్​ సంతతికి చెందిన వారూ ఉన్నారు. లేబర్​పార్టీకి చెందిన ఎంపీ తన్మంజిత్​ సింగ్​ థేసీ నేతృత్వంలో వీరంతా సంతకాలు చేశారు. పంజాబ్​లో రోజురోజుకూ దిగజారుతున్న పరిస్థితిని మోదీ ప్రభుత్వానికి వివరించేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల వారికి నష్టం చేకూర్చే విధంగా ఉన్న చట్టాలకు వ్యతిరేకంగా భారత్​పై ఒత్తిడి తేవాలని కోరారు.

గత నెలలో కొత్త వ్యవసాయ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. పలువురు ఎంపీలు భారత హై కమిషన్​కు లేఖ రాసినట్లు రాబ్​కు వివరించారు. పంజాబ్​ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో రైతులే కీలకం అని తెలిపారు. ఇదీ కేవలం భారత్​కు మాత్రమే సంబంధించిన అంశం కాదని.. బ్రిటన్​, విదేశాల్లోని సిక్కులందరిపై దీని ప్రభావం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

ఇప్పటికే రైతుల అంశంలో కెనడా నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. భారత్ ​లాంటి ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో విదేశీ నాయకుల జోక్యం మంచిది కాదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'నిరసన చేపట్టే హక్కు రైతులకు ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.