ETV Bharat / international

73వ వివాహ వసంతంలోకి రాజ దంపతులు

author img

By

Published : Nov 20, 2020, 6:35 PM IST

బ్రిటన్​రాణి ఎలిజబెత్-2, యువరాజు ఫిలిప్​ల వివాహం జరిగి 73వసంతాలు పూర్తయింది. ఈ వేడుక సందర్భంగా తమ మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్​ కార్డును పరిశీలిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు రాజ​ దంపతులు.

Queen, Prince Philip celebrates 73rd anniversary
73వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్న రాయల్​ దంపతులు

బ్రిటన్ క్వీన్​ ఎలిజబెత్-2​ దంపతులు శుక్రవారం తమ 73వ పెళ్లిరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన ఫొటోను తమ అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రాజ​ దంపతులు తమ మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్​ కార్డును పరిశీలిస్తూ కనిపించారు.

Queen, Prince Philip celebrates 73rd anniversary
మనవళ్లు తయారు చేసిన గ్రీటింగ్​ కార్డును పరిశీలిస్తున్న రాయల్​ దంపతులు

ఎలిజబెత్​ తన 21వ ఏట 1947లో ఫిలిప్​ను వివాహమాడారు. 1952 నుంచి బ్రిటన్​ రాణిగా కొనసాగుతున్నారు. ఫిలిప్​ మాత్రం ప్రజాజీవితం నుంచి రిటైర్ అయ్యారు. ఇంగ్లాండ్​లో కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం దంపతులిద్దరూ ఐసోలేషన్​లో ఉన్నారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.