ETV Bharat / international

పాకిస్థాన్​ ప్రధానిది ఒక మాట- సైన్యానిది మరో మాట

author img

By

Published : Sep 5, 2019, 6:02 AM IST

Updated : Sep 29, 2019, 12:09 PM IST

మొదటిగా అణ్వస్త్ర దాడులు చేయకూడదనే నియమమేదీ తమకు లేదని పాక్ సైన్యం ప్రకటించింది. ఇటీవలే ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ చేసిన వ్యాఖ్యలకు ఈ ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.

'అణ్వస్త్ర ప్రయోగంలో అలాంటి పాలసీ మాకు లేదు'

పాకిస్థాన్ సైన్యం​ మరోసారి తన తలబిరుసుతనాన్ని ప్రదర్శించింది. ఏ దేశంపైనా అణ్వస్త్ర దాడులు మొదటిగా మొదలుపెట్టకూడదన్న నియమం తమకు లేదని స్పష్టం చేసింది. 'కశ్మీర్'​ అంశంపై భారత్​-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రధాని వర్సెస్​ సైన్యం

పాక్ సైన్య అధికార ప్రతినిధి మేజర్​ జనరల్​ ఆసిఫ్​ గఫూర్ ' అణ్వాయుధాలు మొదటిగా ప్రయోగించకూడదనే నియమం పాకిస్థాన్​కు లేదు' అని తాజాగా ప్రకటించారు. ఇదే అంశంపై ఇటీవలే స్పందించిన పాక్​ ప్రధాని.. భారత్​తో అణుయుద్ధాన్ని పాక్​ మొదలుపెట్టదన్నారు. పాక్​ సైన్యం ప్రకటన.. ఇమ్రాన్​ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉండటం గమనార్హం.

'కశ్మీరం'పైనే రగడ

భారత్​ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. అలాగే రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు విభజించింది. దీనిపై పాక్​ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయంగా నానా రభస సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. అయితే కశ్మీర్​ పూర్తిగా తమ అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే​ ప్రపంచదేశాలకు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: భారత్​-రష్యా మధ్య 15 కీలక రంగాల్లో ఒప్పందాలు

AP Video Delivery Log - 1800 GMT Horizons
Wednesday, 4 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1540: HZ Germany IFA ASUS Laptop AP Clients Only 4228150
ASUS launch new range of laptops for creative industry
AP-APTN-1327: HZ Belgium Design Fair AP Clients Only 4228170
Brexit fears on the mind of European designers
AP-APTN-1326: HZ UK Loch Ness AP Clients Only 4157519
Secrets of Loch Ness to be revealed thanks to E-DNA testing ++REPLAY++
AP-APTN-1316: HZ UK Pet Passports AP Clients Only 4226320
Why Brexit is driving pet owners barking mad ++REPLAY++
AP-APTN-1131: HZ UK Connected Cows AP Clients Only 4228127
British cows moo-ve into new tech with 5G collars
AP-APTN-0950: HZ UK Goat Pilates AP Clients Only 4227279
Pygmy goats join pilates classes
+REPLAY+
AP-APTN-0900: HZ Brazil Tortoise AP Clients Only 4227860
Zoologists bring extinct tortoises back to Rio de Janeiro
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated :Sep 29, 2019, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.