ETV Bharat / international

Taliban news: అఫ్గాన్​లో కో- ఎడ్యుకేషన్​ బంద్!​

author img

By

Published : Aug 21, 2021, 5:24 PM IST

Updated : Aug 21, 2021, 5:36 PM IST

మహిళా హక్కులను గౌరవిస్తామని చెప్పిన తాలిబన్లు అందుకు విరుద్ధ నిర్ణయాలనే అమలు చేస్తున్నారు. అఫ్గానిస్థాన్​లోని ఓ రాష్ట్రంలో కో- ఎడ్యుకేషన్​(taliban banning education)కు చరమగీతం పాడుతున్నట్లు ప్రకటించారు.

taliban
తాలిబన్

అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆగడాలు మొదలయ్యాయి. మహిళల హక్కులను గౌరవిస్తామని వారు ఇస్తున్న హామీకి.. వారి చర్యలకు పొంతన లేకుండా పోయింది. తాజాగా.. హెరాత్ ప్రావిన్సులోని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కో- ఎడ్యుకేషన్​ను(taliban banning education) నిషేధించారు తాలిబన్లు. సమాజంలోని అన్ని చెడులకు అదే మూలకారమని అభివర్ణించారు.

వర్సిటీల ప్రొఫెసర్లు, కళాశాల యాజమాన్యలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు తాలిబన్లు. అఫ్గాన్​ను చేజిక్కించుకున్న తర్వాత వారు జారీ చేసిన ఫత్వా (ఇస్లామిక్ చట్ట ఆధారిత ఆదేశం) ఇదే.

గురువులపైనా ఆంక్షలు..

చర్చ సందర్భంగా.. మరో ప్రత్యామ్నాయం లేదని, కో- ఎడ్యుకేషన్​కు తప్పనిసరిగా ముగింపు పలకాల్సిందేనని తాలిబన్ల(taliban news) ప్రతినిధి ముల్లా ఫారిద్ అన్నారు. ఉపాధ్యాయురాళ్లను కేవలం విద్యార్థిణులకు బోధించడానికే అనుమతిస్తామని, పురుష విద్యార్థులకు తరగతులను నిర్వహించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

గత రెండు దశాబ్దాల్లో విద్యాలయాల్లో కో ఎడ్యుకేషన్​తో పాటు లింగ ఆధారిత ప్రత్యేక తరగతులను అఫ్గాన్​లో నిర్వహించారు.

ఇదీ చూడండి: Taliban news: రుచిగా వండలేదని మహిళ ఒంటికి నిప్పంటించిన తాలిబన్లు!

Last Updated :Aug 21, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.