ETV Bharat / international

పాకిస్థాన్​లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి

author img

By

Published : Oct 21, 2020, 10:53 AM IST

Updated : Oct 21, 2020, 11:09 AM IST

explosion rocks Pakistan's Karachi
పాకిస్థాన్​లో భారీ పేలుడు

10:47 October 21

పాకిస్థాన్​లో భారీ పేలుడు

పాకిస్థాన్​లోని కరాచీ గుల్షాన్​ ఈ ఇక్బాల్​ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కరాచీ విశ్వవిద్యాలయం మస్కాన్​కు ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ పేలుడు జరిగింది. అయితే.. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమీప భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.  

పేలుడు ఏ విధంగా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 

Last Updated :Oct 21, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.