ETV Bharat / international

బైడెన్ వాతావరణ సదస్సుకు హాజరుకానున్న జిన్ పింగ్

author img

By

Published : Apr 21, 2021, 6:19 PM IST

China President Xi Jinping
చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ నిర్వహించనున్న వాతావరణ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ హాజరుకానున్నారు. ఈ సదస్సు ఈ నెల 22 నుంచి 23వరకు జరగనుంది.

వాతావరణ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన ప్రపంచనేతల సదస్సు(ఏప్రిల్22-23)కు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరుకానున్నారు. ఈమేరకు చైనా అధికారికంగా వెల్లడించింది.

2005 నుంచి 2030లోగా.. చైనాలో కర్బన ఉద్గారాలను 65 శాతం తగ్గిస్తామని డిసెంబర్​లో జిన్​పింగ్​ స్పష్టం చేశారు. అయితే.. ఈ శాతాన్ని మరింత తగ్గించే విషయం గురించి చైనా అధినేత మార్పులేమైనా చేస్తారా అన్నసంకేతాలు ప్రస్తుత ప్రకటనలో లేదు.

వాతారవరణ మార్పుల కట్టడిలో పరస్పర సహకారం సహా.. ఇతర దేశాలకు తోడ్పాటునందించేందుకు అమెరికా, చైనా అంగీకరించాయి. ఆ దిశగా తక్షణ కార్యాచరణ అమలుకు యూఎస్ ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీ, చైనా ప్రతినిధి జీ జెన్హువాలు.. షాంఘైలో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాతావరణ సంక్షోభంపై అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తలపెట్టిన ప్రపంచ నేతల సదస్సుకు కొద్ది రోజుల ముందే ఈ ప్రకటన వెలువడింది.

ముప్పుగా మారే అవకాశం!

కర్బన కాలుష్య కారకాలను విడుదల చేసే దేశాల్లో చైనా, అమెరికాలు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. భూతాపనికి కారణమయ్యే శిలాజ ఇంధన పొగలో సగం మేర అవే బయటకు పంపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం.. వాతావరణ మార్పుల కట్టడి కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న కృషికి ఊతమిస్తుంది. అయితే.. మానవ హక్కులు, వాణిజ్యం, చైనా దురాక్రమణలతో ఆ రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం.. ఈ ప్రయత్నాలకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'ఈయూ సదస్సుకు మోదీ హాజరు వర్చువల్​గానే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.