ETV Bharat / international

అమెరికాకు చైనా షాక్​- హైపర్​సోనిక్ అణు​ క్షిపణి ప్రయోగం!

author img

By

Published : Oct 17, 2021, 2:58 PM IST

చైనా (China missile) తొలిసారి అణు సామర్థ్యాలు ఉన్న ఓ హైపర్​ సోనిక్​ క్షిపణిని ప్రయోగించింది. ఈ మేరకు బ్రిటన్​కు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. ఆశ్చర్యపోవడం అమెరికా వంతైంది.

అమెరికా ఆశ్చర్యపోయేలా.. చైనా(China missile) తొలిసారి అణు సామర్థ్యాలు ఉన్న ఓ హైపర్​సోనిక్​ క్షిపణి పరీక్ష చేపట్టింది. ఈ మేరకు బ్రిటన్​కు చెందిన ఓ వార్తాపత్రిక వెల్లడించింది. చైనా(China missile) ఈ ప్రయోగం ఆగస్టులో జరిపిందని తెలిపింది యూకే దినపత్రిక ఎన్​హెచ్​కే వరల్డ్​.

క్షిపణి (China missile news) గగనతలంలో తక్కువ ఎత్తు నుంచే ప్రయాణించిందని.. అయితే లక్ష్యం మాత్రం గురితప్పిందని వెల్లడించింది. ప్రయోగం విజయవంతం కాకున్నా హైపర్​సోనిక్​ క్షిపణి టెక్నాలజీపై చైనా పురోగతి.. అమెరికాను షాక్​కు గురిచేసిందని పేర్కొంది.

అమెరికా, రష్యా ఇప్పటికే ఈ హైపర్​సోనిక్​ క్షిపణులను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించగల ఈ మిస్సైల్​ను చైనా(China missile) కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లయితే.. అమెరికా, జపాన్​ క్షిపణి రక్షణ వ్యవస్థలపై(China missile news) తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: Lucy Mission Nasa: నింగిలోకి 'లూసీ'.. 12 ఏళ్లు, 630 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.