ETV Bharat / international

ట్రంప్ X బైడెన్: ఇక మిగిలింది ఆ రాష్ట్రాలే

author img

By

Published : Nov 5, 2020, 1:15 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించేందుకు అవసరమైన 270 సీట్లలో.. బైడెన్​ 264 స్థానాల్లో గెలుపొందారు. ట్రంప్​ 214 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇంకా 5 రాష్ట్రాల్లో ఫలితాలు రావాల్సి ఉన్నందున.. విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Which US states are still counting votes and when will they be done?
అమెరికా 2020- ఇక మిగిలింది ఆ రాష్ట్రాలే..

అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందోనన్న ఉత్కంఠ ఇంకా వీడట్లేదు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ 264 ఎలక్టోరల్‌ ఓట్లతో మ్యాజిక్‌ ఫిగర్‌(270)కు దాదాపు చేరువయ్యారు. అయితే.. ఇంకా ఫలితం తేలాల్సిన రాష్ట్రాల్లో ట్రంప్‌, బైడెన్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటివరకు 45 రాష్ట్రాల్లో ఫలితాలు రాగా.. మరో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు రావాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా...

ఇదీ చదవండి: ట్రంప్xబైడెన్: అమెరికాలో నిరసనల హోరు

పెన్సిల్వేనియా

ఈ రాష్ట్రంలో ట్రంప్‌.. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. ఇక్కడ ఇంకా 7,65,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇందులో కనీసం 59 నుంచి 61శాతం ఓట్లు డెమొక్రటిక్​ అభ్యర్థి వస్తేనే గానీ పెన్సిల్వేనియాలో బైడెన్‌ నెగ్గలేరు.

జార్జియా

జార్జియాలోనూ ట్రంప్‌, బైడెన్‌ మధ్య గట్టి పోటీ నెలకొంది. బైడెన్‌పై ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. ఇక్కడి ఓట్ల లెక్కింపుపై ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆయన‌ ఇక్కడ ఓడిపోతే రీకౌంటింగ్‌ చేయాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

నార్త్‌ కరోలినా

ఈ రాష్ట్రంలోనూ ట్రంప్‌, బైడెన్‌ మధ్య ఓట్ల తేడా కేవలం 2శాతం కంటే తక్కువగానే ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. బైడెన్‌ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. అయితే.. ఇక్కడ నవంబరు 12 వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ను అనుమతించారు. దీంతో ఇక్కడి ఫలితాలు కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఒబామా రికార్డును బ్రేక్ చేసిన బైడెన్

నెవాడా

ఈ రాష్ట్రంలో కూడా బైడెన్, ట్రంప్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ట్రంప్‌ కంటే బైడెన్‌ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. నెవాడా ఫలితాలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తోన్న ట్రంప్‌.. లెక్కింపుపై కోర్టుకెళ్లే యోచనలో ఉన్నారు.

అలస్కా

ఈ రాష్ట్రంలో మూడు ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా.. ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

ఇప్పటికే పెన్సిల్వేనియా, మిషగన్‌లో ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్‌ బృందం.. అక్కడి కోర్టులో దావా వేసింది. నెవెడా, అరిజోనా ఫలితాలపై కూడా కోర్టు వెళ్లాలని యోచిస్తోంది.

ఇదీ చదవండి: ఉత్కంఠగానే అమెరికా ఉభయ సభల ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.