ETV Bharat / international

ఉత్కంఠగానే అమెరికా ఉభయ సభల ఫలితాలు

author img

By

Published : Nov 5, 2020, 8:53 AM IST

అమెరికా సార్వత్రిక ఎన్నికల్లో రిపబ్లికన్లు-డెమొక్రాట్ల మధ్య ఉత్కంఠ స్థాయి పోరు కొనసాగుతోంది. అయితే అధ్యక్ష ఎన్నికల తరహాలోనే చట్టసభల్లోనూ అనిశ్చితి నెలకొంది. మొత్తం 435 స్థానాలున్న దిగువ సభలో.. ఇప్పటివరకు డెమొక్రాట్లు 192 స్థానాల్లో గెలుపొందగా, రిపబ్లికన్లు 185 స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం 218 స్థానాలు అవసరమైన నేపథ్యంలో ఇక్కడా ఆసక్తికరమైన పోరు నడుస్తోంది.

THE SUSPENCE CONTINUOUS IN BOTH SENATE AND REPRESENTATIVES HOUSES IN US ELECTIONS
అమెరికా ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ- ఉభయ సభలదీ అదే దారి

అమెరికా చట్టసభల్లో ఆధిపత్యానికి ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లోని అనిశ్చితే ఇక్కడా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికలతో పాటు ఎగువసభ అయిన సెనేట్‌, దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(ప్రతినిధుల సభ)కు ఎన్నికలు జరిగాయి.

ఇదీ చదవండి: కోర్టుకెక్కిన ట్రంప్- కౌంటింగ్​ నిలిపివేయాలని డిమాండ్!

ఇంతవరకు ఎగువసభలో రిపబ్లికన్లకు, దిగువసభలో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉండగా.. ప్రస్తుతం తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53, డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉండగా.. ఇద్దరు స్వతంత్ర సభ్యులున్నారు. ఈ ఎన్నికల్లో 35 స్థానాలకు ఓటింగ్‌ జరిగింది. ఇందులో 23 రిపబ్లికన్ల స్థానాలు కాగా, 12 డెమొక్రాట్లవి.

ఎవరు ఎన్ని స్థానాల్లో..

దిగువ సభలో 435 స్థానాలు ఉండగా.. హోరాహోరీ పోరు కొనసాగుతోంది. కనీస మెజార్టీకి 218 సీట్లు అవసరమైన తరుణంలో.. ఇంతవరకు డెమొక్రాట్లు 192, రిపబ్లికన్లు 185 స్థానాల్లో గెలుపొందారు.

ఇదీ చదవండి: అధ్యక్ష పోరు: మ్యాజిక్‌ ఫిగర్‌ '270' చేరువలో బైడెన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.