ETV Bharat / international

అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన చర్చ ప్రారంభం

author img

By

Published : Dec 18, 2019, 10:32 PM IST

Updated : Dec 19, 2019, 7:15 AM IST

trump
అమెరికా అధ్యక్షుడిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిపై ప్రతినిధుల సభలో చర్చ ప్రారంభమైంది. అనంతరం అధ్యక్షుడి అభిశంసనపై ఓటింగ్ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని డెమొక్రాట్ సభ్యులు పేర్కొనగా, తనపై అభిశంసన అక్రమమని పేర్కొంటూ స్పీకర్ నాన్సీ పెలోసికి డొనాల్డ్ లేఖ రాశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశనంసనపై దిగువసభ అయిన ప్రతినిధుల సభ సమావేశమైంది. ట్రంప్​పై అభియోగాలపై సభలో చర్చ ప్రారంభమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. స్పీకర్ నాన్సీ పెలోసి, డెమొక్రాట్ సభ్యులు అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ట్రంప్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అదే సమయంలో తనపై అభిశంసన అక్రమమని, విద్వేషపూరితంగా చేపడుతున్నారని డొనాల్డ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షుడిని అభిశంసిస్తూ రెండు తీర్మానాలను ప్రవేశపెట్టారని అమెరికా వార్తాసంస్థలు వెల్లడించాయి.

అయితే అభిశంసనపై సుదీర్ఘ చర్చ ప్రారంభానికి ముందే ట్రంప్... స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. 2020లో అధ్యక్ష ఎన్నికల అనంతరం డెమొక్రాట్లు తమ పనిపై పశ్చాత్తాప పడతారని లేఖలో పేర్కొన్నారు.

"డెమొక్రాట్​ చట్టసభ్యులు రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి అభిశంసన ప్రక్రియ చేపట్టారు. రెండున్నర శతాబ్దాల అమెరిక​ శాసన చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. మీరు అభిశంసన ప్రాధానాన్ని తగ్గిస్తున్నారు. అభిశంసన చర్యతో ముందుకు వెళితే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లే. రాజ్యాంగంపై మీ విధేయతను ఉల్లంఘిస్తున్నారు. అమెరికా​ ప్రజాస్వామ్యంపై బహిరంగ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు."

- స్పీకర్​కు లేఖలో ట్రంప్​

ప్రజలే సరైన గుణపాఠం చెబుతారు..తాను ఎటువంటి నేరాలు, దుశ్చర్యలకు పాల్పడలేదని లేఖలో పేర్కొన్నారు ట్రంప్​. అభిశంసన చర్యతో ముందుకు వెళ్తే డెమొక్రాట్లు క్షమించరాని తప్పు చేసినట్లేనని తెలిపారు. తాను పదవీ విరమణ చేసిన తర్వాతే నూతన అధ్యక్షుడు వస్తారని స్పష్టం చేశారు. 2020లో జరిగే ఎన్నికల్లో డెమొక్రాట్లకు ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'అభిశంసన ప్రక్రియ ఆపండి'... స్పీకర్​కు ట్రంప్​ లేఖ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EUROPEAN UNION - AP CLIENTS ONLY
Strasbourg - 18 December 2019
1. Various of Jewher Ilham - daughter of Uighur scholar Ilham Tohti - arriving at news conference with European Parliament President David Sassoli
2. SOUNDBITE (English) Jewher Ilham, daughter of Ilham Tohti: ++CONTAINS SHOT CHANGE++
"I'd like to thank everyone. Unfortunately, my father cannot accept this award by himself. I wish I did not have to be here. I wish he could come by himself. I wish this award didn't even have to be given to him. I wish human rights awards like this didn't even have to exist, which (would) mean human rights violations do not exist in the world. There are so many people who have a moderate voice just like my father, those Uighur people, a lot of them just like my father are locked up in prison or camps just for being who they are - Uighurs."
3. Journalist asking question
4. SOUNDBITE (English) Jewher Ilham, daughter of Ilham Tohti: ++CONTAINS CUTAWAY AND SHOT CHANGES++
"Back to my normal life. Everytime I think about what my father told me, you have to be tough, you have to fight for the right reason, then that keeps me going. I hope my father will not be ashamed of me and that's what also keeps me going this far. I hope to rescue him, I want to rescue the people who he cared, who I care, who everyone cares. So I just hope, he doesn't even have to say anything to me, I don't even have to say anything to him, as long as he is safe I don't have to see him in the future as long as he is safe, as long as he is free."
5. Close of audience member
6. Ilham and Sassoli at news conference
STORYLINE:
The daughter of jailed Uighur scholar Ilham Tohti paid an emotional tribute to her father after accepting the European Parliament's Sakharov Prize on his behalf on Wednesday.
Tohti is a prominent critic of China's policies towards the Uighur minority and was jailed for life in 2014.
Jewher Ilham said she wished human rights awards didn't exist because that would mean there were no human rights violations in the world.
"There are so many people who have a moderate voice just like my father, those Uighur people, a lot of them just like my father are locked up in prison or camps just for being who they are - Uighurs," Jewher Ilham said.
Tohti is known as a moderate voice with ties to both the country's Han Chinese establishment and the Muslim Uighur ethnic group that has long complained about what they say is harsh treatment under the government.
He was convicted of fanning ethnic hatred, advocating violence and instigating terror through his classroom teaching and a website on Uighur issues.
A few weeks ago, Chinese authorities said it was "problematic" for the European Parliament to be awarding the 2019 Sakharov Prize for Freedom of Thought to Tohti, whom it described as a "criminal".
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated :Dec 19, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.