ETV Bharat / international

Ukraine Tension: 'ఉక్రెయిన్​పై దాడికి రష్యా కుట్ర'

author img

By

Published : Feb 4, 2022, 5:20 AM IST

Ukraine Tension: ఉక్రెయిన్​పై దాడి చేసేందుకు రష్యా కుట్రలు పన్నుతోందని అమెరికా ఆరోపించింది. ఉక్రెయిన్ బలగాలు రష్యన్లపై దాడి చేసినట్లు చిత్రించి.. తద్వారా ఉక్రెయిన్​పై దాడి చేయాలని రష్యా యోచిస్తోందని పెంటగాన్​ పేర్కొంది. ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉన్నట్లు వెల్లడించింది.
ukraine tension
ukraine tension

Ukraine Tension: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసింది అమెరికా. తూర్పు ఉక్రెయిన్​లోని తమ జనాభాపై ఉక్రెయిన్ సైన్యం దాడికి పాల్పడాలని రష్యా యోచిస్తోందని.. ఆ సాకుతో పొరుగు దేశంపై సైనిక చర్యకు దిగేందుకు కుట్రలు పన్నుతోందని పెంటగాన్​ ప్రతినిధి జాన్​ కిర్బీ ఆరోపించారు.

"ఉక్రెయిన్​పై రష్యా దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు మా దగ్గర సమాచారం ఉంది. రష్యన్​ సార్వభౌమ భూభాగంపై లేదా రష్యన్​ మాట్లాడే ప్రజలపై ఉక్రెయిన్​ మిలిటరీ లేదా ఇంటెలిజెన్స్​ దళాలు ద్వారా బూటకపు దాడికి పాల్పడాలని రష్యా యోచిస్తోంది. ఇందుకు రష్యా కొన్ని గ్రాఫిక్​ వీడియోను రూపొందించబోతోంది. కొన్ని ప్రదేశాలు, మిలటరీ పరికరాలు ధ్వంసం చేసినట్లు.. మృతదేహాలు, బాధితులను ఉండేట్లు గ్రాఫిక్​ వీడియోను తయారు చేస్తుంది" అని కిర్బీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలను కిర్బీ బయటపెట్టలేదు.

ఇదీ చూడండి: ఐరోపాకు అమెరికా బలగాలు- పుతిన్​ తీవ్ర ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.