ETV Bharat / international

బ్రిటన్​పై కరోనా పంజా- కథ మళ్లీ మొదటికి!

author img

By

Published : Sep 25, 2020, 6:54 AM IST

Latest updates on worldwide corona virus cases
బ్రిటన్​పై కరోనా పంజా.. వైరస్​ కథ మళ్లీ మొదటికి!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 3,23,94,957 కేసులు నమోదయ్యాయి. 9.8లక్షలమంది వైరస్​కు బలయ్యారు. బ్రిటన్​లో వైరస్​ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,94,957మందికి వైరస్​ సోకింది. 9,87,066మంది వైరస్​ ధాటికి బలయ్యారు. అమెరికా, ఐరోపాలో తీవ్రత మళ్లీ పెరుగుతోంది.

బ్రిటన్​లో...

బ్రిటన్​లో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 6వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

వైరస్​ విజృంభణపై వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నుంచి బ్రిటన్​ పాఠాలు నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 4,16,363 కేసులు వెలుగుచూశాయి. 41,902మంది మరణించారు.

ప్రపంచ దేశాల పరిస్థితి ఇలా...

దేశంకేసులుమృతులు
అమెరికా 71,84,980207,516
బ్రెజిల్​46,59,9091,39,883
రష్యా11,28,83619,948
కొలంబియా7,90,82324,924
పెరూ7,82,69531,870
మెక్సికో7,10,04974,949
స్పెయిన్​7,04,20931,118
అర్జెంటీనా6,78,26614,766
దక్షిణాఫ్రికా6,67,04916,283

ఇదీ చూడండి:- 2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.