ETV Bharat / international

Biden china: నవంబర్ 15న బైడెన్​- జిన్​పింగ్​ భేటీ

author img

By

Published : Nov 13, 2021, 12:34 AM IST

Updated : Nov 13, 2021, 6:34 AM IST

biden, xi jinping
బైడెన్, జిన్​పింగ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden China), చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ సోమవారం వర్చువల్​గా భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

అమెరికా- చైనా సంబంధాలు(US china relationship) క్షీణిస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం(నవంబర్ 15) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden China), చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ వర్చువల్ వేదికగా భేటీ కానున్నారని శ్వేతసౌధం ప్రకటించింది.

'అధ్యక్షుడు బైడెన్.. సెప్టెంబర్ 9న జిన్​పింగ్​తో ఫోన్​లో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే.. ఇరు దేశాల మధ్య పోటీ వివాదాస్పదంగా మారకూడదనే అంశంపై ప్రస్తుత వర్చువల్ భేటీలోనూ మాట్లాడనున్నారు.' అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.

ఈ వర్చువల్ భేటీలో ఇరు దేశాలు తమ ఉమ్మడి ఆసక్తులపై విస్తృతంగా చర్చించనున్నట్లు సాకి పేర్కొన్నారు. గతంలో బైడెన్, జిన్​పింగ్​ ఫోన్​ సంభాషణ నేపథ్యంలో.. ఏడాది చివరిలో వర్చువల్​గా భేటీగా కానున్నట్లు నిర్ణయించుకున్నారని తెలిపారు.

ఉద్రిక్త పరిస్థితులు..

కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో.. చైనాపై వాణిజ్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించారు. ఆ తర్వాత వచ్చిన బైడెన్‌ కూడా ట్రంప్ ఆంక్షలను కొనసాగించారు. మానవ హక్కులు, తైవాన్, జిన్‌జియాంగ్, టిబెట్‌తో సహా.. అనేక సమస్యలనుద్దేశించి చైనాపై సమిష్టిగా ఒత్తిడి తెచ్చేందుకు యూఎస్ మిత్రదేశాలతో కలిసి పనిచేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరగబోయే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి:

Biden China: జిన్​పింగ్​కు బైడెన్​ ఫోన్​.. ఆ అంశంపైనే చర్చ..

Last Updated :Nov 13, 2021, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.