ETV Bharat / international

మాస్కు విషయంలో కాల్పులు- ఒకరు మృతి

author img

By

Published : Jun 15, 2021, 8:24 AM IST

shoot
అమెరికా, కాల్పులు

ముఖంపై మాస్కు ధరించమన్నారని కాల్పులకు తెరలేపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికా అట్లాంటాలోని ఓ సూపర్​ మార్కెట్​లో జరిగింది.

ఫేస్​ మాస్క్ ధరించమన్నారని ఓ గ్రాసరీ స్టోర్​ క్యాషియర్​పై కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో క్యాషియర్​ మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికా అట్లాంటాలో జరిగింది.

దక్షిణ డెకాబ్ ప్రాంతంలోని బిగ్ బియర్ సూపర్​ మార్కెట్​లో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఘటనకు కారణమేంటనేదానిపై స్పష్టత రాలేదన్నారు.

ఇదీ చదవండి:అమెరికాలో పేలిన తుపాకీ.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.