ETV Bharat / entertainment

Tillu Square Release Date : 'టిల్లు స్వ్కేర్‌' వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 1:09 PM IST

Tillu Square Release Date : టిల్లు స్వ్కేర్‌ వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే
Tillu Square Release Date : టిల్లు స్వ్కేర్‌ వచ్చేస్తున్నాడు.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే

Tillu Square Release Date : హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం టిల్లు స్వ్కేర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఎప్పుడంటే?

Tillu Square Release Date : 'డీజే టిల్లు'తో ఒక్కసారిగా యూత్​లో క్రేజీ హీరోగా మారిపోయాడు సిద్ధు జొన్నల్లగడ్డ. ఈ చిత్రం అంచనాలకు మించి విజయం సాధించి మంచి వసూళ్లనూ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ ప్రకటించారు. అయితే వాయిదా పడుతూ వచ్చిన ఈ సీక్వెల్​ రిలీజ్​ డేట్​పై తాజాగా క్లారిటీ ఇచ్చింది మూవీటీమ్​.

వివరాళ్లోకి వెళితే.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్​ చిత్రాన్ని గతేడాది దీపావళికి అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్​ను ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచారు మేకర్స్. అయితే మొదట ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్‌ 15న రిలీజ్​ చేయాలని భావించారు. కానీ షూటింగ్ కంప్లీట్​ పూర్తి కాకపోవడం వల్ల వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు.

ఇప్పుడు తాజాగా ఈ చిత్ర కొత్త రిలీజ్‌ డేట్‌ను నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్​గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాత కూడా ఓ పోస్ట్‌ పెట్టారు. "మరోసారి నవ్వులు పూయిస్తూ చరిత్ర సృష్టించడానికి టిల్లు స్వ్కేర్‌ వచ్చేస్తున్నాడు. మొదటి పార్ట్‌ను మించి వినోదాన్ని పంచనున్నాడు. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు మాస్‌ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనున్నాడు" అని తెలిపారు.

Siddu Jonnalagadda Upcoming Movies : కాగా, రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. మొదటి భాగంలో రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు నీరజ కోన డైరెక్షన్​లో సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమాలో నటిస్తున్నారు. చిత్రంలో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. రీసెంట్​గా ఈ మూవీ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఇంకా నందినిరెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.

Anupama Parameswaran Photo Gallery : చీరకట్టులో మల్లు ముద్దుగుమ్మ.. ఆ చూపుతోనే మాయ చేస్తోందిగా!

OTT Movies And Web Series This Week : ఓటీటీలోకి 'చంద్రముఖి-2'.. ఈ వారం ఇంకా ఏయే సినిమాలు రానున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.