ETV Bharat / entertainment

Tiger 3 Katrina Bath Towel Fight : 'టైగర్ 3' ప్రమోషన్​ షురూ.. వామ్మో ఈ సీన్​ కోసం అన్ని రోజులు పాటు ప్రాక్టీస్​ చేశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 8:24 PM IST

Tiger 3 Katrina Bath Towel Fight : 'టైగర్ 3' ప్రమోషన్​ షురూ.. వామ్మో ఈ సీన్​ కోసం అన్ని రోజుల పాటు ప్రాక్టీస్​ చేశారా?
Tiger 3 Katrina Bath Towel Fight : 'టైగర్ 3' ప్రమోషన్​ షురూ.. వామ్మో ఈ సీన్​ కోసం అన్ని రోజుల పాటు ప్రాక్టీస్​ చేశారా?

Tiger 3 Katrina Bath Towel Fight : 'టైగర్ 3' ట్రైలర్​లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కత్రినా కైఫ్​ బాత్ టవల్ ఫైట్ సీక్వెన్స్​తోనే మూవీ ప్రమోషన్స్​ ప్రారంభించారు మేకర్స్. ఈ ఫైట్ సీక్వెన్స్​కు సంబంధించిన విశేషాలు మీకోసం.

Tiger 3 Katrina Bath Towel Fight : సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్​ 3' దీపావళికి నవంబర్ 12న హిందీ, తెలుగు సహా ఇతర భాషల్లో విడుదల​ కానుంది. అంటే రిలీజ్​కు మరో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో మూవీటీమ్... ప్రమోషన్స్​పై ఫోకస్​ పెట్టింది. అందుకు కావాల్సిన ప్రమోషనల్ మెటీరియల్ కంటెంట్ కూడా సిద్ధం చేసేసింది. ఇప్పటికే పలు ప్రచార చిత్రాలను రిలీజ్​ చేసిన మూవీటీమ్​.. సినిమాను మరింత ప్రేక్షకులకు దగ్గర చేసేలా ప్రమోషన్స్​ చేయనుందట.

అందులో భాగంగా మొదట.. ఇప్పటికే ప్రేక్షకులకు బాగా కనెక్ట్​ అయిన కత్రిన టవల్​ ఫైట్ సీక్వెన్స్​తో ప్రమోషన్​ను షురూ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఇది సోషల్​ మీడియాలో సెన్సేషన్​ సృష్టించింది. దీన్ని చూసి నెటిజన్లు, సినీ ప్రియులు, సల్మాన్ భాయ్ అభిమానులు అంతా ఫిదా అయిపోయారు. అదిరిపోయింది సీక్వెన్స్​.. ఇదొక్కటి చాలు రూ.1000కోట్లు అంటూ తెగ కామెంట్లు చేశారు.

అయితే ఈ బాత్​ టవల్ ఫైటింగ్​ సీక్వెన్స్​లో కత్రినతో పాటు తలపడింది హాలీవుడ్ నటి మిచెల్ లీ. తాజాగా ఆమె ప్రత్యేకంగా దీని గురించి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఈ సీన్​ కోసం తామిద్దరం ఎంతో కష్టపడినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తామిద్దరు కలిసి రెండు వారాల పాటు ప్రాక్టీస్​ చేసినట్లు చెప్పింది. బాడీ కవర్​ అయ్యేలా టవల్స్​ను​ హ్యాండిల్​ చేస్తూ తలపడటం బిగ్​ ఛాలెంజింగ్​గా అనిపించిందని పేర్కొంది.

ఓ చిన్న సీన్​ ఇంతటి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం, సోషల్​ మీడియాలో ట్రెండింగ్​ అవ్వడంపై తానేమీ సర్​ప్రైజ్ కాలేదని చెప్పింది మిచెల్. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించినట్లు కూడా తెలిపింది. అసలీ ఫైట్​ సీక్వెన్స్​ సన్నివేశాన్ని ఎలా చేయాలి, కొత్త‌గా ఎలా చేస్తే ప్రేక్షకులకు మరింత బాగా క‌నెక్ట్ అవుతుంద‌నే దానిపై రెండు వారాల పాటు రీసెర్చ్ కూడా చేసిన‌ట్లు చెప్పింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇకపోతే ఈ టైగర్ 3 చిత్రాన్ని యశ్​ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్​లో స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించారు. మ‌నీష్ శ‌ర్మ సినిమాను డైరెక్ట్​ చేశారు.

NTR Cameo role : 'సలార్'​ - 'టైగర్​ 3'లో ఎన్టీఆర్​ గెస్ట్​ రోల్స్​.. నిజమెంత?

పిల్లలు కావాలి.. కానీ పెళ్లి మాత్రం వద్దు బాబోయ్​!: సల్మాన్​ ఖాన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.