ETV Bharat / entertainment

పిల్లలు కావాలి.. కానీ పెళ్లి మాత్రం వద్దు బాబోయ్​!: సల్మాన్​ ఖాన్​

author img

By

Published : Apr 30, 2023, 2:08 PM IST

బాలీవుడ్​ మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​ సల్మాన్​ ఖాన్​ తనకు తండ్రి కావాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోనంటూ స్పష్టం చేశారు!

Salman Khan talks about marriage, kids
Salman Khan talks about marriage, kids

బాలీవుడ్​ సూపర్ స్టార్​ సల్మాన్ ​ఖాన్..​ పలు సందర్భాల్లో చిన్న పిల్లలపై ఉండే తన ప్రేమను చాటుకున్నారు. సల్మాన్​ తరచుగా తన సోదరి పిల్లలతో గడుపుతుంటుంటారు. పిల్లలతో గడిపితే సమయం మార్చిపోతానని ఎప్పుడూ చెబుతుంటారు. అయితే ఇటీవలే సల్మాన్ ఖాన్​ ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ షో వేదికగా యాంకర్​.. సల్మాన్​ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆయన ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

"ఓ పాపను పెంచుకోవాలనే కోరిక తప్ప.. మా ఇంటికి కోడలిని తీసుకెళ్లాలనే ఆలోచన ఇప్పటికీ లేదు. కానీ మన దేశంలో ఉన్న చట్టాలు దీన్ని అంగీకరిస్తాయో లేదో తెలీదు. అందుకని ఎం జరుగుతుందో వేచి చూద్దాం" అని సల్మాన్​ ఖాన్ సమాధానం ఇచ్చారు. అయితే వివాహ బంధం గురించి ఏనాడూ ఆలోచించని సల్మాన్ ఖాన్.. ​నాన్న అనే పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్లున్నారని అభిమానాలు అంటున్నారు.

కాగా, సల్మాన్​ ఖాన్ హీరోగా నటించిన 'కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌' చిత్రం రంజాన్​ కానుకగా భారీ అంచనాలతో ఈ నెల 21న విడుదల అయింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. షెహనాజ్​ గిల్, పాలక్​ తివారీ, సిద్దార్థ్ నిగమ్, రాగవ్​ జుయల్​, జెస్సీ గిల్​, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీతం రవి బస్రూర్‌ అందించారు. హిమేశ్‌ రేష్మియా, షాజిద్‌ ఖాన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు పాటలు ఆలపించారు. ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడియెన్స్​ను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్​డ్​ టాక్​ సంపాదించింది. తొలి రోజు కేవలం రూ.15 కోట్లే వసూలు చేసింది. తర్వాత రోజు నుంచి కలెక్షన్ల పరంగా ఈ చిత్రం పుంజుకొంది. రెండో రోజు రూ.25.75 కోట్లు, మూడో రోజు రూ.68.17 కోట్లను వసూలు​ చేయడం గమనార్హం. ఈ ఏడాది రంజాన్​ సెంటిమెంట్.. సల్మాన్​కు కలిసి రాలేదనే చెప్పాలి!

ప్రస్తుతం సల్మాన్ ఖాన్..​ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టైగర్ 3'లో నటిస్తున్నారు. కత్రినా కైఫ్.. సల్మాన్​ ఖాన్​ సరసన హీరోయిన్​గా నటించనున్నారు. ఈ సినిమాకు మనీశ్​ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ​'టైగర్ 3'లో షారుక్ ఖాన్ కీ రోల్​లో కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 దీపావళికి థియేటర్లలో సందడి చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.