ETV Bharat / entertainment

'సర్కారు వారి పాట' న్యూ అప్డేట్​.. అదిరిన విజయ్ ఆంటోని​ 'జ్వాల' టీజర్​

author img

By

Published : May 27, 2022, 9:53 PM IST

Cinema Updates:
Cinema Updates:

Cinema Updates: మిమ్మల్ని పలకరించేందుకు మరోసారి సినీ అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో మహేశ్​ 'సర్కారు వారి పాట', విజయ్​ ఆంటోని 'జ్వాల', అక్షయ్​కుమార్​ 'పృథ్వీరాజ్'​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

Sarkaru Vari Paata New Song: సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్​టైనర్ 'సర్కారు వారి పాట'. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమాకు మరో సెన్సేషన్ యాడ్ అవుతున్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెలబ్రేషన్స్ మళ్లీ మొదలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాలో మరో సాంగ్​ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్​గా నటించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్రఖని, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక, ఈ సినిమాను అమెజాన్‌ స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్‌ 24నుంచి స్ట్రీమింగ్‌ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం.

Vijay Antony Jwala Movie Trailer: 'బిచ్చగాడు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విజయ్‌ ఆంటోని. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సినిమా 'జ్వాల'. నవీన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమ్మ క్రియేషన్స్‌ పతాకంపై రానుంది. ఈ సినిమా టీజర్‌ను యువ కథానాయకుడు రానా తన ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని పలు సన్నివేశాలను రష్యా, స్విట్జర్లాండ్​లో చిత్రీకరించారు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అక్షరహాసన్‌ నటిస్తోంది. విజయ్‌ ఆంటోనితో పాటు అరుణ్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AkshayKumar Pridhviraj: అక్షయ్‌ కుమార్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'పృథ్వీరాజ్‌'. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో రానున్న పీరియాడికల్‌ డ్రామాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్‌కు జోడీగా మిస్‌ యూనివర్స్‌- 2017 విజేత మానుషి చిల్లర్‌ నటిస్తున్నారు. జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పేరును మారుస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'పృథ్వీరాజ్‌' సినిమా పేరును 'సామ్రాట్‌ పృథ్వీరాజ్‌' గా మారుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితాధారంగా రూపొందిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళభాషల్లో విడుదల కానుంది. సంజయ్‌దత్‌, సోనూసూద్‌ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది.

అక్షయ్​ కుమార్​ 'సామ్రాట్​ పృథ్వీరాజ్​'

Kathuvakula rendu kadal ott : రొమాంటిక్‌, కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రం 'కాతు వాకుల రెండు కాద‌ల్'. ఈ మూవీకి విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించారు. కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో విడుదలైంది. తమిళంలో పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న ఈ చిత్రంలో స్టార్స్ విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ సినిమా శుక్రవారం.. డిస్నీ హాట్ స్టార్​లోకి వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'ఒంటరిగా చనిపోవడం నా అదృష్టంగా భావిస్తా'.. సామ్ దిమ్మతిరిగే రిప్లై

'కేజీయఫ్ 3'లో హృతిక్ రోషన్?.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.