ETV Bharat / entertainment

దుల్కర్​ సల్మాన్​పై టాలీవుడ్ హీరో అసహనం!

author img

By

Published : Aug 3, 2022, 9:31 AM IST

sitaramam
దుల్కర్​ సల్మాన్​పై టాలీవుడ్ హీరో అసహనం

Sitaramam: టాలీవుడ్​కు చెందిన ఓ హీరో.. తెలుగు చిత్రసీమపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ నటులు లేరా.. వేరే భాషల నుంచి నటులను ఎందుకు తీసుకురావాలంటూ వ్యాఖ్యలు చేశారు.

Sitaramam movie: 'తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? ఇక్కడ ఎవరూ లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా?' అంటూ నటుడు సంతోష్‌ శోభన్‌ అసహనం వ్యక్తం చేశారు. 'సీతారామం' సినిమాను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇది సీరియస్‌గా అన్న మాట కాదండోయ్‌.. ఓ పథకం ప్రకారం చాలా సరదాగా చిత్రీకరించిన ఓ వీడియోలోని దృశ్యం. అసలు విషయం ఏంటంటే.. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రం 'సీతారామం'. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక, సుమంత్‌, తరుణ్‌ భాస్కర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా 'సీతారామం: స్వరాలు' పేరుతో చిత్ర బృందం మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ నిర్వహించింది. దీనికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈటీవీలో ఇటీవల ప్రసారమైన ఈ వేడుకను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పలు భాగాలుగా విడుదలైన ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. సంతోష్‌ శోభన్‌ ఫన్నీ కాన్సెప్ట్‌ వీటిల్లోని ఓ భాగమే.

ఈ వేడుకకు వచ్చేముందు సంతోష్‌ శోభన్‌, నటి మాళవిక నాయర్‌ 'సీతారామం' గురించి ఏమనుకున్నారో సీక్రెట్‌గా చిత్రీకరిస్తారు యాంకర్‌ సుమ. ఆ వీడియోను కార్యక్రమంలో అందరి ముందు ప్రదర్శిస్తారు. అనంతరం, సంతోష్‌, మాళవికలను సుమ వేదికపైకి ఆహ్వానిస్తారు. ఈ క్రమంలోనే ఇదంతా వారు కావాలనే చేశారని తెలిసిపోతుంది. అయినా సంతోష్‌ ఒప్పుకోరు. 'తెలుగు సినిమాల గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దుల్కర్‌ మనవాడు అనుకుంటా' అంటూ హంగామా చేశారు. ఈ పరీక్షలో దుల్కర్‌ పాసయ్యారు. ఇంతకీ సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ఇక్కడ ప్రత్యక్షమవడానికి కారణమేంటి? అని అనుకుంటున్నారా.. ఈ ఇద్దరు జంటగా తెరకెక్కుతున్న 'అన్నీ మంచి శకునములే' చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ నెట్‌వర్క్‌ (స్వప్న సినిమాస్‌) నిర్మిస్తోంది. మరి, ఇంకెందుకు ఆలస్యం 'సీతారామం స్వరాలు' వినేయండి.. తారల నవ్వులు ఆస్వాదించండి..

ఇదీ చూడండి: 'పాన్​ ఇండియా కొత్తేమి కాదు.. ఎప్పటి నుంచో నేను..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.