ETV Bharat / entertainment

ఎన్టీఆర్​ పాతాళభైరవి బింబిసారకు కనెక్షన్​, ఈ విషయం తెలుసా

author img

By

Published : Aug 27, 2022, 9:10 AM IST

Updated : Aug 27, 2022, 9:22 AM IST

patalabhairavi bimbisara
పాతాళభైరవి బింబిసార

హీరో కల్యామ్​రామ్​ నటించిన బింబిసార సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు, అప్పట్లో విజయం సాధించిన ఎన్టీఆర్​ పాతాళభైరవికి ఓ కనెక్షన్​ ఉంది. అదేంంటే.

Bimbisara movie Paruchuri Gopalakrishna హీరో కల్యామ్​రామ్​ నటించిన 'బింబిసార' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్‌ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తనదైన శైలిలో సినిమా గురించి విశ్లేషించారు. బింబిసారను గమనించి చూస్తే ఒక సన్నివేశంలో 'బింబిసార-2' కథకు బీజం పడినట్లు తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కథ పట్ల ఉన్న ఆసక్తితో చాలా రోజుల తర్వాత ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లి చూశానని అన్నారు. ముందుగా ఇటువంటి కథ ఎంచుకుని కల్యాణ్‌రామ్‌ సాహసం చేశాడని, నటనతో ప్రేక్షకుల్ని మెప్పించాడని ప్రశంసించారు. ముఖ్యంగా డైలాగులు చెప్పడంలో కల్యాణ్ రామ్‌ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడని అన్నారు. పౌరాణిక పాత్రల్లో నటించి, ప్రేక్షకుల్ని అలరించడంలో వారి కుటుంబానికి తిరుగులేదని కల్యాణ్‌రామ్‌ మరోసారి నిరూపించారని ఆయన తెలిపారు.

దర్శకుడు వశిష్ఠ్‌ కథను నడిపిన తీరు అద్భుతమని, పాతాళభైరవి(1952) చిత్రంలో ఈ తరహా వైవిధ్యాన్ని మనం చూడొచ్చని ఈ సీనియర్‌ రచయిత అభిప్రాయపడ్డారు. విఠలాచార్య దర్శకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని వశిష్ఠ్‌ 'బింబిసార'ను తీయడంలో విజయం సాధించాడని, మొదటి సినిమా దర్శకుడిలా అనిపించలేదని కితాబిచ్చారు. ఇంకా సినిమాలో శాస్త్రి పాత్రలో నటించిన వివన్‌ భటేనా నటన బాగుందని, శ్రీనివాసరెడ్డి పాత్ర మెప్పించిందని పరుచూరి పేర్కొన్నారు. కీరవాణి సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచిందని ఆయన అన్నారు.

అయితే బింబిసార క్లైమాక్స్‌లో 'సంజీవని ఇద్దరిని బ్రతికిస్తుంది' అనే పాయింట్‌తో బింబిసార-2 కథ ప్రారంభమైనట్లు పరుచూరి ఊహించారు. రెండో వ్యక్తిగా బింబిసారుడు బ్రతికే అవకాశాన్ని దర్శకుడు ఆ సన్నివేశం ద్వారా సృష్టించుకుని ఉండొచ్చని ఆయన అన్నారు. అద్భుతమైన కథని, మరింత అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర యూనిట్‌ను పరుచూరి ఈ సందర్భంగా అభినందించారు.

ఇదీ చూడండి: ఈ ముద్దుగుమ్మల పరిస్థితి ఏంటో, కనీసం ఈసారైనా

Last Updated :Aug 27, 2022, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.