ETV Bharat / entertainment

సర్కారు వారి 'టైటిల్' పాట వచ్చేసింది.. మోత మోగిపోయింది

author img

By

Published : Apr 23, 2022, 11:12 AM IST

mahesh babu
sarkaru vaari paata title song

Sarkaru Vaari Paata Title Song: సూపర్​స్టార్​ మహేశ్​ బాబు నటించిన 'సర్కారు వారి పాట' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో మహేశ్​ లుక్స్​, తమన్ సంగీతం ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

Sarkaru Vaari Paata Title Song: సూపర్​స్టార్ మహేశ్​బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ విడుదలైంది. శుక్రవారం చిత్రబృందం చెప్పినట్టుగానే ఈ పాట మోత మోగిస్తోంది. వరుస హిట్​లతో దూసుకెళ్తున్న మహేశ్​.. దర్శకుడు పరశురాంతో కలిసి తీస్తున్న సినిమా ఇది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన‌ ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ సంస్థ‌ల‌తో క‌లిసి మ‌హేష్​బాబు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మే 12న ఈ చిత్రం విడుదలకానుంది. ఇదివరకే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కళావతి పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరో పాట 'పెన్నీ'లో మహేశ్ ముద్దుల కుమార్తె సితార సందడి చేసి సినిమాకు స్పెషల్ అట్రాక్షన్​గా మారింది.

ఇదీ చూడండి: 'ఆచార్య 'లాహేలాహే ప్రోమో..'సర్కారు వారి పాట' సూపర్​ అప్డేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.