ETV Bharat / entertainment

NTR 30: తారక్​ రోల్​పై ఇంట్రెస్టింగ్​ అప్డేట్​.. ఎక్స్​ట్రా ఫింగర్ ఎలిమెంట్​తో

author img

By

Published : Dec 13, 2022, 12:11 PM IST

Updated : Dec 13, 2022, 12:19 PM IST

కొరటాల శివ-తారక్ కాంబినేషనల్​లో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 గురించి ఓ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

ntr 30 with six fingers
ఎన్టీఆర్​ 30 ఆరు వేళ్లతో ఎన్టీఆర్​

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా పరిచయమైన ఆయన.. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగారు. మధ్యలో కొన్ని పరాజయాలు ఇబ్బంది పెట్టినా.. కొంత కాలం నుంచి విభిన్నమైన కథలతో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే, పాన్ ఇండియా స్టార్‌గానూ క్రేజ్​ సంపాదించుకున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలను లైన్​లో పెట్టే పనుల్లో బిజీగా ఉన్నారయన. అలా ఆర్​ఆర్​ఆర్​ సమయంలోనే ఆయన దర్శకుడు కొరటాలతో ఓ సినిమాను ప్రకటించారు. పాన్​ ఇండియా స్థాయిలో అది పట్టాలెక్కనుంది.

'జనతా గ్యారేజ్‌' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రమిది. నందమూరి అభిమానుల్ని, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఓ శక్తిమంతమైన కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్ని చకచకా పూర్తి చేసుకుంటోంది. అయితే ఇంకా సెట్స్​పైకి వెళ్లని ఈ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఆరు వేళ్లు ఉన్న చేతితో కనిపించబోతున్నారట. ఆ ఎక్స్‌ట్రా ఫింగరే ఆయన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారని తెలిసింది. ఆయనకు కోపం వచ్చిన ప్రతీసారి ఆరో వేలు బిగుసుకు పోవడం ఓ సింబాలిక్​గా నిలుస్తుందట. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో 'రక్షకుడు' సినిమాలో నాగార్జున కోపం వచ్చినప్పుడు నరాలు బయటకు వచ్చినట్లు ఎలా చూపించారో అలానే ఇప్పుడు తారక్​ను కూడా అలానే చూపించనున్నారట. ఇక కథలో కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలిసింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చిత్రంపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

కాగా ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పిస్తున్నారు. అనిరూధ్​ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ఓ ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు కథకు, ఇటు ఎన్టీఆర్‌ ఇమేజ్‌కు సరిపోయేలా 'దేవర' అనే టైటిల్‌ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్‌లో ఈ టైటిల్‌ను రిజిస్టర్‌ కూడా చేయించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇకపోతే కొరటాల.. తనదైన శైలి సామాజిక అంశాలతో.. చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ తన శరీరాకృతిని మార్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన కొత్త లుక్​ కూడా ఒకటి బయటకు వచ్చి వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: లోకేశ్​ యూనివర్స్‌.. విజయ్​ సినిమాలో ఏడుగురు స్టార్‌ హీరోలు!

Last Updated : Dec 13, 2022, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.