ETV Bharat / entertainment

'హాయ్​ నాన్న' ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్!- నాని ఆడియెన్స్​ను మెప్పించాడా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 7:05 AM IST

Updated : Dec 7, 2023, 7:44 AM IST

Hi Nanna Review In Telugu : టాలీవుడ్​ హీరో నాని- అందాల తార మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్​ నాన్న' చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమా​ ఎలా ఉందంటే?

Hi Nanna Twitter Review In Telugu
Hi Nanna Twitter Review In Telugu

Hi Nanna Review In Telugu : సినిమా: హాయ్‌ నాన్న; నటీనటులు: నాని, మృణాల్‌ ఠాకూర్‌, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్‌ బేబీ, విరాజ్‌ అశ్విన్‌, శ్రుతిహాసన్‌ తదితరులు; సంగీతం: హషీమ్‌ అబ్దుల్‌ వాహబ్‌; సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్ ఆంటోనీ; నిర్మాత: మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్‌.; రచన, దర్శకత్వం: శౌర్యువ్; సంస్థ: వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌; విడుదల: 07-12-2023

సినిమా సినిమాకీ సంబంధం లేకుండా ఇమేజ్‌, ట్రెండ్ అంటూ లెక్క‌లేసుకోకుండా క‌థ‌ల్ని ఎంచుకుంటూ ప్ర‌యాణం చేస్తున్న నేచురల్ స్టార్ నాని. ద‌స‌రా మూవీతో మాస్ అవ‌తారాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఆ వెంట‌నే దానికి పూర్తి భిన్న‌మైన ఓ తండ్రీ కుమార్తె క‌థ‌ను ఎంచుకుని 'హాయ్ నాన్న' చేశారు. కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయడంలో ముందుండే ఈ హీరో మ‌రోసారి అదే పంథాలో అడుగులు వేస్తూ శౌర్యువ్ అనే ద‌ర్శ‌కుడిని ఈ సినిమాతో ప‌రిచ‌యం చేశారు. విడుద‌ల‌కి ముందే నాని - మృణాల్ జోడీ, టీజర్, ట్రైలర్ ఆక‌ట్టుకున్నాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?తండ్రీ-కూతుళ్ల పాత్రలు భావోద్వేగాలను పంచాయా?

స్టోరీ ఎంటంటే?
విరాజ్ (నాని) ముంబయిలో ఓ ఫ్యాష‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌. పుట్టిన‌ప్ప‌టి నుంచే జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్న త‌న కూతురు మ‌హి (కియారా)నే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. కూతురికి స‌ర‌దాగా క‌థ‌లు చెప్ప‌డం విరాజ్‌కి అల‌వాటు. ఆ స్టోరీల్లో హీరోగా నాన్న‌ని ఊహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు అమ్మ క‌థ చెప్ప‌మ‌ని అడుగుతుంది మ‌హి. నువ్వు క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే చెబుతానంటాడు. అమ్మ క‌థ కోసం క‌ష్ట‌ప‌డి చ‌దివి క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తుంది. అయినా మ‌హికి త‌న అమ్మ క‌థని చెప్ప‌డు విరాజ్‌. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది మహి. రోడ్డుపై ప్ర‌మాదం నుంచి ఆ చిన్నారిని కాపాడుతుంది య‌ష్న (మృణాల్ ఠాకూర్‌). ఆ త‌ర్వాత ఇద్ద‌రూ స్నేహితులు అవుతారు. త‌న కూతురుని వెదుకుతూ వ‌చ్చిన విరాజ్‌కి యష్నతో క‌లిసి ఓ కాఫీ షాప్‌లో క‌నిపిస్తుంది. అక్క‌డే విరాజ్ మ‌హికి త‌న అమ్మ క‌థ‌ని చెబుతాడు. ఈసారి క‌థ‌లో త‌న అమ్మ వ‌ర్ష పాత్ర‌ని యష్నలో ఊహించుకుంటుంది మ‌హి. ఇంత‌కీ ఆ వ‌ర్ష ఎవ‌రు? కూతురు మ‌హిని వ‌దిలి దూరంగా ఎందుకు ఉంది?యష్నకీ, మ‌హి త‌ల్లికీ సంబంధం ఏమిటి? పెళ్లి నిశ్చ‌య‌మైన యష్న విరాజ్‌ని ఎలా ప్రేమించింది? ఆ ప్రేమ నిల‌బ‌డిందా? చిన్నారి త‌న త‌ల్లి చెంత‌కి చేరిందా లేదా? వంటి త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

  • #HiNannaReview 🌟🌟🌟🌟✨/5

    Just loved the movie 😍Emotion ni baaga handle chesaru..
    Acting was too good by Nani,chinna papa baga cute ga undhi..For me hi nana is the best film of this year Everyone should watch with their families 🥳🧨.Don't miss out in theatres#HiNanna

    — 𝙿𝚂𝚈𝙲𝙷𝙾 𝚁𝙴𝙳𝙳𝚈™ 🌶️ (@Psycho_9045) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సినిమా ఎలా ఉందంటే?
అమ్మానాన్న‌ల ప్రేమ‌క‌థ ఇది. ఈ నేప‌థ్యంలో సాగే క‌థ‌లు టాలీవుడ్​లో కొత్తేం కాదు. కానీ, ఇందులోని ప్రేమ‌క‌థ‌లో మ‌లుపులు కొత్త‌గా ఉంటాయి. హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాలు బ‌లంగా నిలుస్తాయి. చిన్నారి త‌న అమ్మ‌గా క‌థానాయిక‌ని ఊహించుకోవ‌డం మొద‌లైన‌ప్ప‌టి నుంచే ఈ స్టోరీ ఏ దిశ‌గా సాగుతుందో ప్రేక్ష‌కుడు ఓ అంచ‌నాకి వ‌స్తాడు. అయినా స‌రే సీన్స్​ ఓ ప్రేమ‌క‌థ‌కి కావ‌ల్సిన సంఘ‌ర్ష‌ణ‌ని పండిస్తాయి. ట్విస్ట్​లు, ఎమోషన్స్​ సినిమాని మరో స్థాయికి తీసుకెళ‌తాయి. అయితే ఇందులో ఆవిష్క‌రించిన ప్రేమ‌లోనే బ‌లం త‌గ్గిన‌ట్టు అనిపిస్తుంది. నిజానికి రెండు ప్రేమ‌క‌థ‌లు ఇందులో ఉంటాయి. విరాజ్ - వ‌ర్ష క‌థ ఒక‌టి, విరాజ్ - యష్న క‌థ మ‌రొక‌టి. ఆ రెండు ప్రేమ‌ల్లో క‌నిపించాల్సిన మేజిక్, జంట మ‌ధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో లేక‌పోవడంతో ప్ర‌థ‌మార్ధం కాస్త నిదానంగా సాగుతుంది. ప్రేమ‌లో పడ‌టం, విడిపోవ‌డం వంటివి సాధార‌ణంగానే అనిపిస్తాయి త‌ప్ప పెద్ద‌గా అనుభూతిని పంచ‌వు. వ‌ర్ష క‌థ విని య‌శ్న‌ విరాజ్‌తో ప్రేమ‌లో ప‌డటం, ఆ త‌ర్వాత మ‌హి ఎవ‌రి కూతురు అనే మ‌లుపు సినిమాని ఆస‌క్తిక‌రంగా మార్చాయి. ద్వితీయార్ధంలో పండే భావోద్వేగాల‌తో మ‌ళ్లీ ద‌ర్శ‌కుడు క‌థ‌పై ప‌ట్టు ప్ర‌ద‌ర్శించాడు.

  • #HiNannaReview 4/5 ⭐️⭐️⭐️ ⭐️

    A perfect blend of emotions ❤️@NameisNani anna rocked his performance like always natural 🌟#MrnualThakur’s script selection is so good that everyone will love her role. A perfect way to continue Seetha.

    Comedy, emotions & movie has everything

    — MessiVK (@Im_vkolhi) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #HINanna - Emotional Rollercoaster ❤️👏

    Good First Half , Feel good second Half , Nani - Mrunal Pair 😍❤️👌 , Finally one more Family Entertainer from Natural Star 🌟 Congratulations 🎊 team 🤝.!#HINannaReview @NameisNani

    — POWER Talkies (@PowerTalkies1) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తండ్రీ కూతుళ్ల పాత్ర‌లు ఆ ఇద్దరి నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు ఈ సినిమాకి హైలైట్‌. ప్ర‌థ‌మార్ధంలో 'ఇక్క‌డ్నుంచి వెళ్లిపోదాం నాన్న' అని చిన్నారి చెప్ప‌డం, ద్వితీయార్ధంలో నువ్వు నిజ‌మైన అమ్మవి కాదుగా అంటూ చిన్నారి క‌థానాయిక‌తో చెప్ప‌డం, 'ఎక్క‌డ త‌ప్పు చేశాను నా ప్రేమ స‌రిపోవ‌డం లేదా' అని చిన్నారితో విరాజ్‌ చెప్పే సంద‌ర్భాలు ప‌తాక స్థాయి భావోద్వేగాల్ని పండిస్తాయి. చివ‌రిలో జ‌యరామ్ పాత్రతో మ‌రో ప్ర‌ధాన మ‌లుపు కీల‌కం. నాయ‌కానాయిక‌లు ఎలా ఒక్క‌ట‌వుతార‌నే ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు జ‌య‌రామ్ పాత్ర‌తో య‌ష్నకి నిజం చెప్పిస్తారా? లేదా అనే అనుమానాలు త‌లెత్తుతాయి. అలా చేసుంటే ఈ సినిమా సాధార‌ణంగా మారిపోయేది. 'వ‌ర్ష డివోర్స్ అడిగిందేమో నేను కాదు' అంటూ యష్న త‌న ప్రేమ‌ని నిల‌బెట్టుకోవ‌డం ఈ సినిమాకి హైలైట్. ఊహ‌కు అందే క‌థ‌, అక్క‌డ‌క్క‌డా నిదానంగా సాగే స‌న్నివేశాలున్నాయి. అయినా కుటుంబ ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డే ఈ త‌ర‌హా భావోద్వేగాల‌తో సినిమాలు ఈమ‌ధ్య కాలంలో రాలేదు. టార్గెట్ ప్రేక్ష‌కులకి వినోదం పంచ‌డంలో మాత్రం ఈ చిత్రం విజ‌య‌వంతం అవుతుంది.

  • #HiNanna

    Soul-stirring Emotional Drama!@NameisNani rocked with moving performance and is the heart of the film. @mrunal0801 is perfect as Yashna.

    Baby Kiara is a Bundle of love @shouryuv - Excellent writing & direction. A debut to remember

    Hesham added life to the film…

    — uppu sreenivasulu (@SREENU_24) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఎవ‌రెలా చేశారంటే?
నాని మ‌రోసారి త‌న న‌ట‌న‌తో హృద‌యాల్ని బ‌రువెక్కించాడు. చిన్నారితో క‌లిసి ఆయ‌న పండించిన భావోద్వేగాలు ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. నాని, మృణాల్ ఠాకూర్ జోడీ బాగున్నా... ఆ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌క‌థ‌కి త‌గ్గ కెమిస్ట్రీ జస్ట్‌ ఒకే. కానీ, ఇద్ద‌రూ మాత్రం చాలా బాగా న‌టించారు. మృణాల్ ప్రేమ స‌న్నివేశాల్లోనూ, ప్రీ క్లైమాక్స్‌లోనూ త‌న అభిన‌యంతో క‌ట్టిప‌డేసింది. బేబి కియారా ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ, కంటత‌డి పెట్టించింది. ప్రియ‌ద‌ర్శి, అంగ‌ద్ బేది, జ‌య‌రామ్, విరాజ్ అశ్విన్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. క‌థ‌కి త‌గ్గ హాయైన స‌న్నివేశాలు, సంగీతంతో సినిమా సాగుతుంది. సాను జాన్ వ‌ర్గీస్ విజువ‌ల్స్‌, హేష‌మ్ సంగీతం ప్రేక్ష‌కుల్ని వెంటాడుతాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కూర్పు ప‌ర్‌ఫెక్ట్ అనిపించేలా కుదిరాయి. ద‌ర్శ‌కుడు శౌర్యువ్‌కి ఇదే తొలి సినిమా అయినా ఎంతో స్ప‌ష్ట‌త‌తో, ప‌రిణ‌తితో సినిమాని తెరకెక్కించాడు. తెలిసిన స్టోరీనే కొత్తగా భావోద్వేగాల్ని మేళ‌వించి చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • #HiNanna is Heartbreakingly beautiful. Definitely another milestone in @NameisNani filmography. I kept crying on and on....

    — 𝔻𝕖𝕖𝕡𝕒𝕜 (@KodelaDeepak) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • బ‌లాలు
  • + క‌థ‌లోని భావోద్వేగాలు, మ‌లుపులు
  • + నాని, మృణాల్‌, బేబి కియారా న‌ట‌న
  • + సంగీతం, విజువ‌ల్స్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నిదానంగా సాగే ప్ర‌థ‌మార్ధం
  • - ఊహ‌కు అందే క‌థ
  • చివ‌రిగా హాయ్ నాన్న- హృద‌యాల్ని హ‌త్తుకుంటాడు.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

NTR 31 అప్డేట్​- స్టోరీ చాలా కొత్త ఉంటుందట! నీల్​ మామ ఏం చేస్తాడో?

కోకాకోలాతో ఊరిస్తున్న జాన్వీ - క్యూట్​గా కుర్రళ్ల మనసు దోచేస్తుందిగా!

Last Updated :Dec 7, 2023, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.