ETV Bharat / entertainment

'ఆ ఆలోచనే 'సీతారామం'.. అందుకే ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ'

author img

By

Published : Jul 23, 2022, 7:00 PM IST

sitaramam
సీతారామం

Dul Sitaramam movie: దుల్కర్​ సల్మాన్​ నటించిన కొత్త ప్రేమకథా చిత్రం 'సీతారామం'. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలక పాత్ర పోషించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సంగతులు దర్శకుడు హను రాఘపూడి మాటల్లో..

Sitaramam movie: ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడున్నంత కమ్యూకేషన్ లేకపోవడమేనని తాను భావిస్తానని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హను రాఘవపూడి పంచుకున్న విశేషాలు..

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతున్నా, కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేయడానికి కారణం?
హను రాఘవపూడి: 'అందాల రాక్షసి' చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. అయితే, నిర్మాత సాయిగారు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల చాలా సౌకర్యంగా పని చేశా. ఆ తర్వాత 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చేశా. దాని వెంటనే రానాతో ఒక సినిమా అనుకున్నా కుదరలేదు. 'లై', 'పడి పడి లేచే మనసు' ఏడాది గ్యాప్‌లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనాతో కొంత విరామం వచ్చింది. నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ ఆలోచించలేదు.
‘సీతారామం’పై మంచి అంచనాలున్నాయి. వాటిని ఈ చిత్రం అధిగమిస్తుందా?
హను రాఘవపూడి: ఇది చాలా ప్రత్యేకమైన చిత్రం. థియేటర్‌లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్‌లో కనిపిస్తుంది. థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ‘ సీతారామం’అద్భుతమని ప్రేక్షకులు కచ్చితంగా అంటారు.
సీతారామం కథకు ప్రేరణ ఉందా ?
హను రాఘవపూడి: నాకు కోఠి వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు వుంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దుల్కర్ సల్మాన్‌ ని తీసుకోవడానికి కారణం ?
హను రాఘవపూడి: కథ రాసినప్పుడు మైండ్‌లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్న వాళ్లు ఆ సమయంలో బిజీగా ఉన్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్‌ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జర్‌ దేన్ లైఫ్ స్టోరీ.

సీతారామం పాటలు హృద్యంగా ఉన్నాయి. విశాల్ చంద్ర శేఖర్‌ని తీసుకోవడానికి కారణం?

హను రాఘవపూడి: విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది. ప్రతిది స్పూన్ ఫీడింగ్ చేయాల్సిన అవసరం లేదు. సీతారామం పాటలకు వృద్ధాప్యం రానేరాదు.

రష్మిక పాత్రలో ఎలా కనిపించబోతున్నారు?

హను రాఘవపూడి: రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పుతుంది. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఏదో ఒక మలుపు తిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ?
హను రాఘవపూడి: యుద్ధ నేపథ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. ‘యుద్ధంతో రాసిన ప్రేమ’ ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం కనిపించదు. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం ఉంటుంది. ఉదాహరణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం, సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది.
ఉత్తరాలతో కమ్యునికేషన్ చాలా సున్నితమైన అంశం కదా! ఎలా డీల్ చేశారు?

హను రాఘవపూడి: ఉత్తరం అనేది చాలా ప్రత్యేకమైన ఎమోషన్. ప్రేమ కథకి కమ్యునికేషన్ ప్రధాన సమస్య. ఒకప్పుడు ప్రేమ కథలు చాలా హృద్యంగా ఉండటానికి కారణం.. ఇప్పుడంత కమ్యునికేషన్ లేకపోవడమేనని భావిస్తా. ఉత్తరంలో ఎమోషన్ వేరు. ఆ మ్యాజిక్ మిస్ అయిపోయాం. ఆ మ్యాజిక్ ని బాగానే డీల్ చేశానని అనుకుంటున్నా. అదే విధంగా కాగితం మీద ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి వైజయంతి మూవీస్, స్వప్నదత్‌లు సినిమా పట్ల గొప్ప సంకల్పం ఉన్న నిర్మాతలు. ఇక త్వరలో బాలీవుడ్‌లో సన్నీదేఓల్‌, నవాజ్‌తో ఒక యాక్షన్‌ ఫిల్మ్‌ చేయబోతున్నా. అమెజాన్‌ ప్రైమ్‌తో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి: తొలిసారి గిరిజన మహిళకు జాతీయ అవార్డు.. ఒక్క పాటతోనే రికార్డు.. ఎవరామె?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.