ETV Bharat / state

నాలుగో తయారీ యూనిట్‌ను ప్రారంభించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్ - మేడ్చల్ జిల్లా కాళ్లకల్​లో ఏర్పాటు - Deesawala set up fourth unit

author img

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 8:03 AM IST

Deesawala Set up Fourth Unit in Medchal District : రబ్బర్‌ ఉత్పత్తుల రంగంలో రాణిస్తోన్న దీసవాలా రబ్బర్ ఇండ్రస్టీస్‌ విస్తరణలో భాగంగా నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. మేడ్చల్ జిల్లాలోని కాళ్లకల్‌లో నాలుగో తయారీ యూనిట్‌ను ప్రారంభించింది.

Deesawala Set up Fourth Unit in Medchal District
Deesawala Set up Fourth Unit in Medchal District (ETV Bharat)

Deesawala Rubber Industries Inaugurated New Plant in Medchal : రబ్బర్ సీలింగ్ రింగ్‌లు, రబ్బర్ గ్యాస్‌కెట్లు, ఇతర రబ్బర్ ఉత్పత్తుల తయారీ చేస్తున్న దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్, వ్యాపార విస్తరణలో భాగంగా కొత్త ప్లాంట్‌ను నిర్మించింది. మేడ్చల్ సమీపంలోని కాళ్లకల్‌లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంపెనీ నాలుగో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అత్యాధునిక యంత్రాలు, ల్యాబ్ టెస్టింగ్ సదుపాయంతో దీనిని నెలకొల్పామని యాజమాన్యం తెలిపింది.

నూతన ప్లాంట్ వల్ల పెరగనున్న ఉత్పత్తి : ఇప్పటి వరకు రోజుకు 7-8 టన్నులు ఉన్న ఉత్పత్తి, ఈ నూతన ప్లాంట్ వల్ల 25 టన్నులకు పెరుగుతుందని సంస్థ ఎండీ హునేద్ దీసవాలా తెలిపారు. ఐదో యూనిట్‌కు సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరో ఏడాదిలో అందులోనూ కార్యకలాపాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 1996లో ప్రారంభమైన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్, రహదారి, వంతెన ప్రాజెక్టులకు ఉపయోగపడే బేరింగ్ ప్యాడ్‌లు, రబ్బర్‌ స్పీడ్‌ బ్రేకర్లు, పైప్ గ్యాస్‌కెట్లు, యూపీవీసీ పైపులు, ఆటోమొబైల్, పరిశ్రమల్లో ఉపయోగించే రబ్బర్ సామాగ్రిని తయారు చేస్తోంది.

Deesawala Industries in Hyderabad : రైల్వే ప్రాజెక్టుల్లో ఉపయోగించే రైలు ప్యాడ్‌లు, ఔషధ పరిశ్రమల్లో ఉపయోగించే సిలికాన్ ఉత్పత్తులను తయారు చేస్తున్నామని దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్ ఈడీ మూర్తజా దీసవాలా తెలిపారు. నాణ్యత, మన్నికైన వస్తువులను ఉత్పత్తి చేయడం వల్లే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. కంపెనీకి హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 3 తయారీ యూనిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు.

భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ప్రయాణాన్ని ప్రారంభించిందని, అందుకనుగుణంగా రైలు, రోడ్డు, విమానయానం, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు మరింత ఊపందుకున్నాయని ఎండీ హునేద్ దీసవాలా తెలిపారు. తమ సంస్థ ఈ ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. తద్వారా తమకు ఎదగడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని హునేద్ దీసవాలా వివరించారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు : భారత ప్రభుత్వం హర్ ఘర్ నల్ మిషన్‌ను ప్రారంభించిందని, దీనికి దేశవ్యాప్తంగా నీటి పైప్‌లైన్‌ల యొక్క భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం అవసరమని హునేద్ దీసవాలా పేర్కొన్నారు. పైప్ సీల్స్‌గా ఉపయోగించే తమ రబ్బర్ పట్టీలు ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసేందుకు కీలకమైనవని చెప్పారు. ప్రస్తుత విస్తరణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడంలో తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు. అదే సమయంలో వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో రూ.6వేల కోట్ల రెన్యూసిస్ ఇండియా పెట్టుబడులు

'ప్రస్తుతం మా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నాం. మా ఉత్పత్తి శ్రేణికి డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా, మేము దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 5వ యూనిట్‌ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఈ యూనిట్ 2025 సంవత్సరం నాటికి అందుబాటులోకి రానుంది. అలాగే మా మార్కెట్‌ను విస్తరించేందుకు పుణె, బెంగళూరు, చెన్నైల్లో కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశాం.' అని ముర్తాజా దీసవాలా పేర్కొన్నారు. దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్ నిరంతర ఆవిష్కరణలకు కట్టుబడి ఉందని యాజమాన్యం తెలిపింది. రబ్బర్ షీట్ తయారీ, పీవీసీ వాటర్ స్టాపర్‌లు, రబ్బర్ ప్రొఫైళ్లు, నిర్మాణ పరిశ్రమల కోసం రూపొందించిన అడ్హెసివ్‌లతో సహా కొత్త ఉత్పత్తులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని యాజమాన్యం పేర్కొంది.

సమస్యలోంచి పుట్టిన సమాధానమే ఈ 'స్లీపింగ్ బెడ్' - ఇంతకీ ఆ కథేంటో చూద్దామా - Priyanka Salot Yuva Story

వాట్సాప్ గ్రూపును రూ.6,400 కోట్ల కంపెనీగా మార్చిన యువకుడు - ఒక్క ఐడియాతో లైఫ్ ఛేంజ్​! - Dunzo Founder Kabeer Biswas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.