ETV Bharat / entertainment

లైనప్​తో బాలయ్య ఫుల్​ బిజీ.. ఆ సీనియర్​ డైరెక్టర్​కు ఛాన్స్​ దొరుకుతుందా?

author img

By

Published : Aug 4, 2023, 1:18 PM IST

Updated : Aug 4, 2023, 1:39 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ సినిమా షూటింగ్​ దశలో ఉండగానే.. మరో మూవీని లైన్​లో పెడుతున్నారు. ఇదే సమయంలో తాను బాలయ్యతోనే సినిమా చేసి రిటైర్​ అవుతానని సీనియర్​ డైెరెక్టర్​ బి.గోపాల్​ చెబుతున్నారు. ఆ సంగతులు..

Director B Gopal Balakrishna
Director B Gopal Balakrishna

Director B Gopal Balakrishna : సీనియర్​ దర్శకుడు బి.గోపాల్​ గుర్తున్నారా?.. టాలీవుడ్​కు ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలు అందించారు. ఆయన ఈమధ్య యూట్యూబ్​ ఛానెళ్లకు తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తన వ్యక్తిగతమైన విషయాలతోపాటు కెరీర్​లో ఎన్నో మధురానుభూతులను పంచుకుంటున్నారు. అన్నింటిలో ​ఆయన కామన్​గా చెప్పే పాయింట్ మాత్రం ఒకటుంది. అదే బాలయ్యతో సినిమా.

తన ఫేవరెట్ హీరో బాలకృష్ణతో సినిమా తీసి రిటైర్అవుతానని బి.గోపాల్​ ప్రకటించారు. ఆ మధ్య ఓ సినిమా ఫంక్షన్​లో బాలయ్యతో బి.గోపాల్​ కనిపించారు. అప్పట్నుంచి ఈ కాంబినేషన్​పై మళ్లీ చర్చ మొదలైంది. ఆ తర్వాత పలు సందర్భాల్లో బి.గోపాల్ కూడా బాలకృష్ణతో సినిమా చేస్తానని చెబుతూ వస్తున్నారు.

"బాలయ్య కోసం ఓ స్టోరీ రెడీ చేస్తున్నాం. కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆయన డేట్స్ బట్టి సినిమా ఉంటుంది. అయితే దీనికి ఇంకా టైమ్ పడుతుంది. ఎందుకంటే మా కథ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇటు బాలయ్య కూడా బిజీగా ఉన్నారు. కథ పూర్తయి, దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినంత వరకు చెప్పలేం" అని బి.గోపాల్​ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా బాలయ్యతో సినిమా చేస్తానని చెబుతూనే, ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు పరోక్షంగా వెల్లడించారు బి.గోపాల్.

Director B Gopal Balakrishna :
సీనియర్​ దర్శకుడు బి. గోపాల్​

అయితే బాలకృష్ణ, బి.గోపాల్​ది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కాయి. పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బాలయ్యతో మళ్లీ సినిమా తీయలేదు బి.గోపాల్. దాదాపు 20 ఏళ్ల గ్యాప్ వచ్చేసింది.
ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో భగవంత్​ కేసరి సినిమా చేస్తున్నారు. అది ఈ ఏడాది అక్టోబరు 19న విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య.. డైరెక్టర్​ బాబీతో సినిమా చేస్తారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. భగవంత్​ కేసరి అయ్యాక.. బాలయ్య బాబీతో చేతులు కలపనున్నారు.

'భగవంత్ కేసరి' మేనియా అప్పటి నుంచే..
మరోవైపు, భగవంత్​ కేసరి షూటింగ్​ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్లు రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మూడో వారం నుంచి భగవంత్ కేసరి మేనియా స్టార్ట్ కానుందట. అక్కడ నుంచి నందమూరి ఫ్యాన్స్​కు ఫీస్ట్ స్టార్ట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. శరత్ కుమార్, శ్రీలీల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Last Updated : Aug 4, 2023, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.