ETV Bharat / entertainment

మొన్న 'బలగం'.. ఇప్పుడు 'విరూపాక్ష'.. బాక్సాఫీస్​ వద్ద 'కాకి' కాసుల వర్షం!

author img

By

Published : Apr 22, 2023, 2:37 PM IST

Updated : Apr 22, 2023, 3:08 PM IST

సాయిధరమ్​ తేజ్ హీరోగా నటించిన 'విరూపాక్ష' సినిమా హిట్​ టాక్​ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో కాకి మేజర్ రోల్​ చేసింది. మొన్న 'బలగం', నిన్న 'దసరా', నేడు 'విరూపాక్ష'.. ఇలా టాలీవుడ్​లో కాకి హవా సాగుతోంది! అసలు ఈ కాకి డామినేషన్​ ఏంటా? అని నెట్టింట చర్చ నడుస్తోంది.

crow
crow

సాధారణంగా సినిమా అనగానే హీరో ఎవరా? అని ఆరా తీస్తారు సినీ ప్రియులు. కొన్ని సందర్భాల్లో కథ మామూలుగానే ఉన్నా.. కథానాయకుడు తన నటనతో ప్రేక్షకులను మెప్పించి హిట్​ అందుకున్న సినిమాలు బోలెడు. అయితే కొందరు దర్శకులు స్టోరీ డిమాండ్​ను బట్టి జంతువులు, పక్షులను సినిమాల్లో వాడుతుంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి 'కాకి' వచ్చి చేరింది. 'బలగం', 'దసరా', 'విరూపాక్ష' సినిమాలు.. కాకి ద్వారా హిట్ టాక్​ సొంతం చేసుకున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి!

'విరూపాక్ష' మిస్టరీ, థ్రిల్లర్​ జోనర్​లో తెరకెక్కిన చిత్రం. మూఢ నమ్మకాల కోణంలో ఈ సినిమా రూపొందించారు. తాంత్రిక శక్తులు, ఆత్మలతో ప్రేక్షకులను భయపెట్టే విధంగా సినిమా సాగుతోంది. క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు ఉండటం వల్ల కాకిని ఎక్కువగా చూపే ప్రయత్నం చేశారు. హారర్​ సన్నివేశాల్లో ఆడియన్స్​కు ఆసక్తి కలిగించడానికి కాకిని వాడినట్టు సమాచారం. మూములుగా కాకిని అశుభంగా భావిస్తారు! కానీ ఇప్పుడు ఆ కాకియే టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. కాకులే కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి. ఇందుకు 'బలగం,' 'దసరా' సినిమాలే స్పష్టమైన ఉదాహరణలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోహీరోయిన్ పాత్రల తర్వాత కాకిదే ఇంపార్టెంట్​ రోల్​ అంట! అంతెందుకు.. హీరో సాయిధరమ్​ తేజ్​, హీరోయిన్​ సంయుక్త ఫొటోలతో ఉన్న సినిమా పోస్టర్​ బ్యాక్​గౌండ్ర్​ కూడా కాకిదే డామినేషన్​. సినిమాలో ఇతర నటీనటుల కంటే కాకి ఎక్కువ ప్రాధాన్యంగా నిలిచింది.

ఇదీ కథ
చేతబడులతో ఊర్లోని పిల్లలను చంపేస్తున్నారంటూ.. గ్రామస్థులు వారి ఊరికి వచ్చిన జంటను సజీవ దహనం చేస్తారు. వారు మంటల్లో కాలుతూ పుష్కర కాలం తర్వాత ఊరు శ్మశానంగా మారుతుందంటూ శపిస్తారు. వారి శాపం ఫలించి నిజంగానే పన్నెండేళ్ల తర్వాత గ్రామస్థులు వరుసగా మరణిస్తారు. తన తల్లితో బంధువుల ఇంటికి వచ్చిన హీరో.. ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్​) కోసం అదే ఊర్లో ఉంటూ మరణాల వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు పూనుకుంటాడు. మరణాలకు కారణం తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

బలగానికి బలం చేకూర్చిన కాకి!
బలగం సినిమా ఆసాంతం.. మనిషి తదనానంతరం జరిగే కార్యక్రమాల చుట్టూ సాగుతుంది. ఓ కాకి పిండం ముట్టడం అనే సెంటిమెంట్ ఆ సినిమా కీ పాయింట్​. ఇలా ఈ స్టోరీలో కాకి హైలెట్​ అయ్యింది. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ వేణు. అంచనాలు లేకుండా వచ్చిన సినిమా సూపర్​​ హిట్​ అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో కమెడియన్​ ప్రియదర్శి హీరో పాత్రలో నటించారు. అల్లు అర్జున్​ 'గంగోత్రి' ఫేమ్​ నటి కావ్య ప్రాధాన పాత్రలో మెప్పించింది.

Last Updated :Apr 22, 2023, 3:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.