ETV Bharat / entertainment

Bhagavanth Kesari Movie Collection : 'దంచవే మేనత్త కూతురా' దెబ్బకు థియేటర్లు షేక్.. రూ.100 కోట్లు ఖాతాలోకి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 11:16 AM IST

Updated : Oct 25, 2023, 11:23 AM IST

Bhagavanth Kesari Movie Collection : నందమూరి నట సింహం బాలకృష్ణ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'భగవంత్​ కేసరి' మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్ క్రియేట్​ చేస్తోంది. వీకెండ్స్​తో పాటు దసరా సెలవుల కారణంగా ఈ సినిమాకు థియేటర్లలో మరింత రెస్పాన్స్​ వస్తోంది. ఇక తాజాగా 'దంచవే మేనత్త కూతురా' సాంగ్​ను జోడించడం వల్ల కలెక్షన్ల ఇంకా పెరిగాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఆరో రోజు ఎంత వసూలు చేసిందంటే ?

Bhagavanth Kesari Movie Collection
Bhagavanth Kesari Movie Collection

Bhagavanth Kesari Movie Collection : దసరా కానుకగా థియేటర్లలో విడుదలై సంచలనాలు నమోదు చేస్తోంది 'భగవంత్ కేసరి'మూవీ. 'ఆఖండ', 'వీరసింహారెడ్డి', తర్వాత బాలయ్యకు హ్యాట్రిక్​ ఇచ్చింది ఈ సినిమా. రిలీజైన రోజు నుంచే సూపర్ హిట్​ టాక్ అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేసిన 'భగవంత్​ కేసరి' ఇప్పుడు సక్సెస్​ఫుల్​గా ఏడో రోజులోకి అడుగుపెట్టేసింది. అయితే వీకెండ్స్​తో పాటు దసరా వేడుకల కారణంగా కలెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలా ఆరో రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 104 కోట్ల గ్రాస్​ వసూలు చేసిందని మూవీ టీమ్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్ల పంట పండింది. నైజాంలో - రూ.13.98 కోట్లు, సీడెడ్​లో రూ. 11.95 కోట్లు, ఉత్తరాంధ్ర- రూ. 3.95cr, గుంటూరు- రూ. 5.18 కోట్లు, కృష్ణ- రూ. 2.68 కోట్లు, నెల్లూరు - రూ. 1.85 కోట్లు, ఈస్ట్​ గోదావరి- 2.46 కోట్లు, వెస్ట్​ గోదావరి- రూ. 2.28 కోట్లు, కర్ణాటక రూ. 3.9 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 0.5 కోట్లు, యూఎస్​లో రూ. 6.5 కోట్ల కలెక్షన్లను అందుకుందని ట్రేడ్​ వర్గాల టాక్ .

తాజాగా 'దంచవే మేనత్త కూతురా' పాటను రీ క్రియేట్​ చేసి ఈ సినిమాకు జోడించారు. దీంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. స్క్రీన్​పై ఈ పాట వస్తే ఇక అంతే.. థియేటర్లలో ఫ్యాన్స్ ఈలలు డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ పాట సినిమాకు జోడించడం కాస్త ప్లస్​ పాయింట్​ అయ్యింది. తొలి సారి ఈ పాటను థియేటర్​లో మిస్​ చేసుకున్న ఫ్యాన్స్​ రెండో సారి ఈ సినిమాను చూసేందుకు క్యూ కడుతున్నారట.

Bhagavanth Kesari Cast : ఇక భగవంత్​ కేసరి సినిమా విషయానికి వస్తే.. అనిల్​ రావిపూడి డైరెక్షన్​లో వచ్చిన ఈ భారీ యాక్షన్​ మూవీలో బాలకృష్ణ, కాజల్​తో పాటు శరత్ కుమార్, అర్జున్​ రాంపాల్​ నటించారు. ఇందులో బాలకృష్ణ లుక్సే కాదు డైలాగ్స్​ కూడా కొత్తగా ఉన్నాయి. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్‌కు ఫ్యాన్స్​ థియేటర్లలో విజిల్స్​ మోత మోగించారు. సంగీత దర్శకుడు తమన్‌ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్​ను అందించారు.

Bhagvant Kesari Sequel : 'భగవంత్‌ కేసరి' సీక్వెల్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

Bhagvant Kesari Movie : గుడ్​ న్యూస్ చెప్పిన బాలయ్య.. ఇక థియేటర్లు మోతే.. ఫ్యాన్స్​ పండగ చేసుకోండి

Last Updated : Oct 25, 2023, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.