ETV Bharat / entertainment

Bhagvant Kesari Sequel : 'భగవంత్‌ కేసరి' సీక్వెల్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అనిల్‌ రావిపూడి

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 6:34 AM IST

Updated : Oct 24, 2023, 8:26 AM IST

Bhagvant Kesari Sequel : దసరా బాక్సాఫీస్ ముందు 'భగవంత్​ కేసరి' బ్లాక్​ బాస్టర్ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్ర సక్సెస్​ సెలబ్రేషన్స్​లో ఈ సినిమా సీక్వెల్​ గురించి మాట్లాడారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఏం అన్నారంటే?

Bhagvant Kesari Sequel
భగవంత్ కేసరి సీక్వెల్​

Bhagvant Kesari Sequel : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన చిత్రం భగవంత్‌ కేసరి. కాజల్‌ అగర్వాల్​, శ్రీలీల కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా రీసెంట్​గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద బ్లాక్ బాస్టర్​ టాక్​తో దూసుకుపోతోంది. విశేష స్పందన దక్కుతోంది. దీంతో మూవీటీమ్​.. హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్‌ రాజు, దర్శకురాలు నందిని రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేశారు. "నాతో కలిసి పనిచేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ధైర్యం నాకు లేదు. ఈ బరువు మోసినందుకే చాలా నలిగిపోయాను. సీక్వెల్‌ తీయగలిగే శక్తిని బాలకృష్ణ నాకిస్తే వెంటనే తీస్తాను" అని అన్నారు. ఇంకా సినిమా గురించి పలు విషయాలను చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదే ఈవెంట్​లో దిల్​రాజు మాట్లాడుతూ.. "మా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌ రావిపూడి ఇప్పటికే 5 చిత్రాలు చేశారు. భగవంత్‌ కేసరి గురించి నాకు ఎప్పుడో చెప్పారు. తెలంగాణ యాసలో బాలయ్య సంభాషణలు చెబితే చాలా కొత్తగా ఉంటుందని అన్నాను. మొదటి నుంచీ బ్రో ఐ డోంట్‌ కేర్‌ టైటిల్​ అనుకున్నాడు. ఆ తర్వాత భగవంత్‌ కేసరిగా మార్చాడు. ఎప్పుడూ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు చేసే అనిల్​.. ఇలాంటి బలమైన కథను రాయడం గొప్ప విషయం అని చెప్పాలి. యాక్టర్​గా శ్రీలీలకు మంచి ఫ్యూచర్​ ఉంది. ఈ సినిమా రిలీజ్​కు ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్‌ అని మాత్రమే అనేవారు. కానీ, ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్​ జయసుధ, జయప్రద, శ్రీదేవిలను గుర్తు చేసింది. బాలయ్య డెడికేషన్‌తో నటించారు. ఇది లాంగ్‌రన్‌ ఫిల్మ్‌" అని దిల్‌ రాజు పేర్కొన్నారు.

కాగా, ఈ భగవంత్ కేసరి సినిమాలో ఓ పాటను యాడ్ చేస్తున్నట్టు చెప్పింది మూవీటీమ్​. నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న పాటను 50-60 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించారని చెప్పుకొచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యంగ్​ హీరోస్​ టు సీనియర్ కథానాయకులు.. ఇప్పుడందరూ అదే పాత్రలో..

OG - Gunturu Karam - Devara Updates : దసరా స్పెషల్​.. పవన్-మహేశ్​-ఎన్టీఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్స్

Last Updated :Oct 24, 2023, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.